ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు:
ఉసిరికాయలు - 10
ఆవపిండి -ఆర1 కప్పు
కారం - 1 కప్పు
ఉప్పు - కప్పు
పసుపు - చిటికెడు
వేయించిన మెంతి పొడి - 1 స్పూను
చింతపండు గుజ్జు - 3 స్పూన్లు
ఇంగువ 1/2 స్పూను
పోపుదినుసులు - తగినన్ని
నువ్వులనూనె - 1 1/2 కప్పు.
తయారు చేసే విధానం:
ఆవకాయ పెట్టాలంటే ముందుగా ఉసిరికాయకి చాకుతో గాని లేదా ఫోర్క్ తో గాని గాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నువ్వులనూనె వేసి ఉసిరికాయల్ని మూతపెట్టి దోరగా వేయించుకున్నాకా వాటిని ఒక బౌల్ లోకి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం, అరకప్పు ఆవపొడి(ఆవఘాటు కావాలనుకునేవారు ఒక కప్పు వేసుకోవచ్చు, మెంతిపొడి వేసి దానిలో వేడినీటితో నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి పచ్చి మెంతులు కొన్నివేసి కలపాలి. ఇలా కలుపుకున్న ఆవకాయలో మెంతులు, అవ్వలు, జీలకర్ర, ఇంగువ,ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. మిగిలిన నువ్వులనూనెని కూడా కలిపి ఉంచుకుంటే ఏడాది మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ ఆవకాయ రెడీ అవుతుంది.
.....కళ్యాణి
|