ఈ కర్రీ కోసం ముందుగా కడాయిలో మెంతులు వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించి అందులో నువ్వులు,పల్లీలు వేయాలి. ఇవి వేగాకా ఎండుకొబ్బరి ముక్కలు వేసి అన్ని వేగాకా ఒక బౌల్ లోకి తీసి, దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలో మరికొంత నూనే వేసి అందులో పొడుగుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర వేసి అవి రెండు నిమిషాలు వేయించాకా వాటిని కూడా ముందుగా తీసిపెట్టుకున్న గ్రేవీ మిశ్రమంలో కలిపి అన్నిటిని మిక్సి పట్టి ఉంచుకోవాలి.
కూర కోసం మిర్చీలకి తొడిమలు తీసి మద్యలో గాటు పెట్టి వాటిని కడాయిలో కాస్త వేయించాలి. వేగిన మిర్చీలను ఒక బౌల్ లోకి తీసి ఉంచాలి. ఇప్పుడు మళ్లి కడాయిలో కాస్త నూనె వేసి కరివేపాకు వేసి చిటపటలాడాకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసి అందులో చింతపండు నీళ్ళు,అల్లంవెల్లులి పేస్టు,కారం,ధనియాలపొడి,గరంమసాల, వేసి అయిదు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. తర్వాత మిర్చిలు వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఆపెయ్యటమే.
దానిని సర్వింగ్ బౌల్ లోకి తీసి పైన పాలమీగడ వేసుకుంటే చాలు,ఎంతో రుచికరమైన మిర్చి సాలన్ కర్రీ మీ ముందుంటుంది.