ఆకు కూరలపులుసు
కావలసిన పదార్ధాలు:
* పాలకూర -1 కట్ట
* కొయ్య తోట కూర -1 కట్ట
* మెంతి కూర -1 కట్ట
* పెరుగు తోట కూర -1 కట్ట
* గోంగూర -1
* కట్ట కొత్తిమీర -1 కట్ట
* కారం - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు -రుచికి సరిపడా
* పసుపు - 1 టీ స్పూన్
పోపు కోసం:
* నూనె -2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ - 1 (ముక్కలు )
* కరివేపాకు - ౩ రెమ్మలు
* తాలింపు గింజలు - 1 టేబుల్ స్పూన్
* వెల్లులి రెబ్బలు - 6
* ఎండు మిర్చి - 2
తయారీ విధానం:
* ఆకు కూరలన్నీ విడి విడిగా, సన్నగా తరిగి పెట్టాలి.
* కుక్కర్ లో 1 కప్పు నీళ్ళు పోసి ,తరిగిపెట్టిన ఆకుకూరలు , పసుపు , కారం , ఉల్లిపాయలు ముక్కలు, 2 వెల్లులి రెబ్బలు వేసి ,కుక్కర్ మూత పెట్టి , ౩ విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి.
* ఉడికిన ఆకుకూరల్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి.
*బాండిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి , వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వరసగా వేస్తూ తాలింపు తయారు చేయాలి.
* ఈ తాలింపుని మెత్తగా మెదిపి పెట్టిన ఆకుకూరలు పులుసులో వేసి బాగా కలిపి , కొంచెం కొత్తిమీర చల్లాలి.
* మూతపెట్టి 5 నిముషాలు అలాగే ఉంచితే తాలింపులో ఆకుకూరల పులుసు బాగా మగ్గుతుంది .ఈ కూర అన్నంలో ,చపాతీ , రోటిల్లో చాలా బాగుంటుంది.
|