ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపి
కావలసినవి :
ప్రాన్స్ (రొయ్యలు) : అరకిలో
బాస్మతి బియ్యం : అరకిలో
ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు
పచ్చి బఠాని : అరకప్పు
గుడ్లు : 2
నూనె : 1 కప్పు
క్యారెట్ ముక్కలు : అరకప్పు
బీన్స్ ముక్కలు : అరకప్పు
కరివేపాకు : కొంచం
కొత్తిమిర : 1 కట్ట
సోయా సాస్ : 1 టీ స్పూన్
మిరియాల పొడి : అర టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
ముందుగా పచ్చి బఠాని, బీన్సు, క్యారెట్ ముక్కలు ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు పగలగొట్టి కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి పక్కన పెట్టాలి గుడ్డు సొనను కర్రీ ల వండి పక్కన పెట్టాలి. అలాగే ప్రాన్స్ ను కూడా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి నీరుపోసి ఉడకపెట్టి ఉంచుకోవాలి. తరువాత అన్నం కొంచం పదునుగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి, కాగాక ఉల్లి ముక్కలు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉడకబెట్టిన ప్రాన్స్ వేసి వేగాక పచ్చిమిర్చిపేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, ఉడకపెట్టిన వెజిటేబుల్స్ వేసి కొద్దిగా వేపి ఉడికిన అన్నం వేసి కలిపి, గుడ్డు మిశ్రమం కూడా వేసి బాగా మిక్స్ అయ్యేవరకు కలపాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమిర తో గార్నిష్ చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ.
|