మామిడి పలావ్
సమ్మర్లో మనకు గుర్తొచ్చేవి మామిడి పండ్లు. వీటితో మనం చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మామిడి పండ్లతో పులావ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1 కప్పు
మామిడి గుజ్జు : 1
జీడిపప్పు: 1/4 కప్పు
పోపుగింజలు : తగినంత
ఎండుమిర్చి: 2
నెయ్యి: 2
దాల్చిన చెక్క: తగినంత
యాలకులు: కొద్దిగా
లవంగాలు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
* ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి.
* ఈ లోపు ఓ బాణలి తీసుకొని దానిలో నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో పోపుగింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
* ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని పోపు మిశ్రమంలో వేసి కొంచెం నీరు పోసి ఉడికించుకోవాలి.
* రైస్ ఉడుకుతుండగా అందులో మామిడిపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి, మూత పెట్టాలి. అన్నం ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
|