Home » Vegetarian » Semiya Daddojanam Recipe
సేమియా దద్దోజనం రెసిపి
కావలసినవి:
ఆవాలు 1 టీ స్పూన్
కరివేపాకు రెండు రెబ్బలు
పల్లీలు 2 టీ స్పూన్స్
అల్లం, పచ్చిమిర్చి తురుము 2 టీ స్పూన్లు
శొంఠి - అర అంగుళం ముక్క
ఉప్పు- తగినంత సేమియా - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
జీలకర్ర - 1 టీ స్పూన్
నూనె తగినంత
తయారీ:
ముందుగా ఒక గినెలో పెరుగు గిలక్కొట్టుకుని అందులో ఉప్పు కలుపుకోవాలి. అందులో శొంఠి ముక్కచితక్కొట్టి వేసుకోవాలి.
ఒక గిన్నె స్టవ్‌మీద పెట్టుకుని తగినన్ని నీరు పోసి సేమియా వేసుకుని ఉడికించి తీసి నీరు లేకుండా తీసేసి కలిపి ఉంచుకున్న పెరుగు గిన్నెలో సేమియా వేసుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న మూకుడులో నూనె వేసుకుని కాగాక ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి బాగా వేపుకుని ఆ పోపుని పెరుగు సేమియా మిశ్రమంలో వేసుకుని కలుపుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి..