Home » Non-Vegetarian » Natu Kodi Pulusu


 

 

 

 

నాటుకోడి పులుసు

 

 

కావలసిన పదార్ధాలు:

నాటుకోడి - 1

ఉల్లిపాయలు - 2

కరివేపాకు -2 రెమ్మలు

కొత్తిమీర -1 కట్ట (సన్నగా తరగాలి)

కారం - 2 చెంచాలు

ఉప్పు - తగినంత

పసుపు - 1 చెంచా

ధనియాల పొడి - 2 చెంచాలు

ఎండు కొబ్బరి - 1 చిప్ప (చిన్నది)

గసగసాలు - 2 చెంచాలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు

నూనె - 4 చెంచాలు


తయారుచేసే విధానం:

ముందుగా నాటుకోడిని మొత్తంగా తీసుకొని దానికి పసుపు, ఉప్పు కొద్దిగా నూనె పట్టించి, చితుకుల మంటపై లేదా బార్బి క్యూ (barbecue) పై అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి. లేదా అవెన్ లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆతరువాత నాటుకోడి చల్లారే వరకూ పక్కన పెట్టి.. అది చల్లారిన తరువాత దానిని తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ( చిన్న ముక్కలుగా చేసుకున్న తరువాత కడగరాదు). ఈ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేపాలి. ఉల్లిపాయలు వేగాక మసాలా పట్టించిన నాటుకోడి ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లుపోసి సన్నని మంటమీద చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండుకొబ్బరిని సన్నగా తరిగి పొడిగా వేపుకోవాలి. గసగసాలు కూడా వేపుకోవాలి. ఎండుకొబ్బరి, గసగసాలు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఉడికిన చికెన్ లో వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఇంకో పదినిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తరువాత దించి సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. ఇది చపాతీ, పుల్కా, జొన్నరొట్టె, రైస్ దేనితో అయినా బాగుంటుంది.

 


Related Recipes

Non-Vegetarian

Andhra Chepala Pulusu

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)

Non-Vegetarian

Chicken 65

Non-Vegetarian

Mutton Keema Cutlet

Non-Vegetarian

Chicken Curry Telangana Special

Non-Vegetarian

Mutton Keema Pizza

Non-Vegetarian

Mutton Keema