Home » Non-Vegetarian » Mutton Special


 

 

మటన్‌ స్పెషల్

 

 

 

 

కావలసిన పదార్థాలు
మటన్‌  - ముప్పావు కేజీ
ఉల్లిపాయలు - 1/2
అల్లంవెల్లుల్లి - 3 స్పూన్లు
కారం - 2 స్పూన్లు
ధనియాలపొడి - 3 స్పూన్లు
లవంగాలు - 6
యాలకులు - 5
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
పెరుగు - 2 స్పూన్లు
టొమోటో  ప్యూరి - 2 స్పూన్లు
గరం మసాలా - 3 స్పూన్లు
నూనె - సరిపడ
ఉప్పు - తగినంత

 

తయారీ :
ముందుగా పాన్‌లో నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు మసాలా దినుసులను వేసి చిన్న మంట మీద వేయించి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాకా కడిగిన మటన్‌ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మూతపెట్టి 40 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలిపి కారం, ధనియాల పొడి, పెరుగు వేసి తక్కువ మంటమీద ముక్కలు మెత్తగా అయ్యే దాకా ఉంచాలి. తరువాత మటన్‌ మెత్తబడ్డాక టొమోటో పేస్ట్ ,గరంమసాలా కూడా వేసి కలిపి మూతపెట్టి మరో పది నిమిషాలు సన్నని మంటపై ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో కాని చపాతితో  కాని సర్వ్ చేసుకోవాలి...

 

 

 


Related Recipes

Non-Vegetarian

మెంతికూర మటన్ గ్రేవీ!

Non-Vegetarian

గోంగూర ఎండు రొయ్యలు

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

ఎగ్ మసాలా కర్రీ

Non-Vegetarian

మటన్ పులావ్

Non-Vegetarian

Andhra Chepala Pulusu

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)