Home » Non-Vegetarian » Mutton Biryani


 

 

 

మటన్ బిర్యానీ

 

 

 

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం  -  ఒక కేజీ
మటన్‌ - ఒక  కేజీ 
పెరుగు - రెండు కప్పులు 
ఉప్పు - సరిపడా
ఉల్లిపాయలు - పెద్దవి రెండు 
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - రెండు స్పూన్లు 
ధనియాల పొడి - రెండు స్పూన్లు 
యాలకుల పొడి - ఒక  స్పూన్‌ 
మిరియాల పొడి - ఒక  స్పూన్లు 
దాల్చిన చెక్క - కొద్దిగా  
జీలకర్ర - ఒక స్పూన్‌ 
కుంకుమ పువ్వు - చిటికెడు  
లవంగాలు - కొద్దిగా  
నెయ్యి - ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగా 

 

తయారీ విధానం :
ముందుగా మటన్‌ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లి , ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, పెరుగు, నీళ్లు పోసి బాగా కలిపి రెండు గంటలు నానబెట్టాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో మటన్‌ ముక్కలు వేసి సమానంగా పరవాలి. తర్వాత లవంగాలను నేతిలో వేయించుకోవాలి. వీటిని మటన్‌ ముక్కల మీద వెయ్యాలి. తరువాత కడిగిన బియ్యానికి అరలీటరు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కల మీద వేసి మూత పెట్టి చిన్న మంటమీద ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలో  నీరు ఇగిరి పోయేవరకు వుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరికి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ.

 

 

 


Related Recipes

Non-Vegetarian

మెంతికూర మటన్ గ్రేవీ!

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ

Non-Vegetarian

మటన్ పులావ్

Non-Vegetarian

కుండ బిర్యాని

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)