Home » Vegetarian » Masala tomato curry


 

 

మసాలా టమాటా కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు
టొమోటోలు -  అర కేజీ
నూనె - తగినంత
గసగసాలు.- రెండు స్పూన్లు
జీడిపప్పులు - కొద్దిగా
నువ్వులు. 2 స్పూన్లు
చింతపండు - కొద్దిగా
ఉల్లిపాయలు - పావు కేజీ
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
పసుపు - అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్లు
మసాలా పౌడర్. 2 స్పూన్లు
కొత్తిమీర - ఒక కప్పు

 

తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి  కొద్దిగా నూనె వేసి అందులో గసగసాలు, కొన్ని ఉల్లిపాయల ముక్కలు జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి  . తరువాత నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న చింతపండు , సరిపడా ఉప్పు, కారం అన్నికలిపి  మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత  స్టవ్‌ వెలిగించి  పాన్  పెట్టి మిగిలిన ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు  వేయించాలి. ఇప్పుడు  అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి  టొమోటో ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత  మసాలాను వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి . గ్రేవీ దగ్గరకొచ్చాక మసాలా పౌడర్ వేసి రెండు నిముషాలు ఉంచి చివరిలో  కొత్తిమీర వేసి బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకోవాలి....

 

 


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

ఆనియన్ పరోటా

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

How to Make Tomato and Basil Sauce with Vegetables