Home » Others » Mango Fish Curry


 

మ్యాంగో ఫిష్ కరీ

 

 

కావలసిన పదార్థాలు:

చేప ముక్కలు - ఆరు

మామిడికాయ - ఒకటి

చింతపండు గుజ్జు - రెండు చెంచాలు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - ఆరు

టొమాటోలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా

కారం - నాలుగు చెంచాలు

పసుపు - అరచెంచా

కొబ్బరిపాలు - ఒక కప్పు

నీళ్లు - ఒక కప్పు

నూనె - నాలుగు చెంచాలు

కరివేపాకు - ఒక రెమ్మ

కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు - తగినంత

 

తయారీ విధానం:

చేపముక్కల్నిశుభ్రంగా కడిగి... ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. మామిడికాయను చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. రంగు మారాట టొమాటో ముక్కలు కూడా వేయాలి. ఉడికిన తరువాత మామిడికాయ ముక్కలు వేయాలి. కొద్ది క్షణాలు వేయించాక నీళ్లు పోసి మూత పెట్టాలి. కాసేపటికి మామిడి ముక్కలు మెత్తగా అయిపోతాయి. అప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి కలిపి... ఆపైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపముక్కలు వేయాలి. పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి సన్నగా చీరి వేయాలి. తరువాత మూత పెట్టేసి పది నిమిషాలు ఉంచాలి. తరువాత కొబ్బరిపాలు కూడా వేసి మళ్లీ మూత పెట్టేయాలి. పులుసు బాగా చిక్కబడే వరకూ ఉడికించి... కొత్తిమీర చల్లి దించేయాలి.

- Sameera

 


Related Recipes

Others

Paneer Tikka

Others

కఠోరి చాట్ తయారుచేయు విధానం

Others

స్వీట్ కట్టర్ పానీ పూరి

Others

సజ్జప్పాలు

Others

Janthikalu (Mothers Day Special Recipes)

Others

Bobbarla Vada - Sankranti Special

Others

How to Make Katori Chaat Recipe

Others

Cauliflower kurma kura