Home » Rice » Kubali Recipe


  

కుబాలి రైస్

 

 

 

కావలిసినవి:

బియ్యం - ఆరకేజీ

శెనగపప్పు - రెండు కప్పులు 

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు 

గరంమసాలా - కొద్దిగా 

పుదీన - రెండు కట్టలు 

నిమ్మకాయ - ఒకటి  

నెయ్యి - చిన్న కప్పు 

మిటాయిరంగు - చిటికేడి 

పెరుగు - రెండు కప్పులు 

పసుపు, ఉప్పు, కారం, నూనె - తగినంత 

 

తయారు చేసే విధానం:

ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి. అలాగే శెనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడకపెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ  ముక్కలను వేయించి, అవి ఎర్రగా వేగిన తరువాత కారం, పసుపు, గరంమసాలా, ఉడికించిన శెనగపప్పును కూడా కలిపి కాసేపు స్టౌ మీద ఉంచి దింపాలి. ఈ మిశ్రమంలో పెరుగు, పుదీన ఉప్పును కూడా చేర్చి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో ఎసరుపెట్టి, నానబెట్టిన బియ్యాన్ని ఎసరులో పోసి ముడోంతులు ఉడకగానే అన్నాన్ని వార్చేసి, అదే గిన్నెలో కాస్తా నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత సగం అన్నాన్ని ఒక పొరగా వేసి, దానిపై శెనగపప్పు కూరను వేసి దానిపై మిగిలిన అన్నాన్ని మరో పొరలా వేసి ఆ పైన నెయ్యిను వెయ్యాలి. చివరిగా నిమ్మరసం చిటికెడు మిఠాయిరంగును అన్నం పై చల్లి ముతపెట్టి పదిహేను నిమిషాలు పాటు ఉడికించాలి.

 


Related Recipes

Rice

ట‌మాటా కొత్తిమీర రైస్‌

Rice

బ్లాక్ రైస్ ఇడ్లీ

Rice

పనీర్ ఫ్రైడ్ రైస్

Rice

జీరా రైస్ ఇలా చేస్తే...మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!

Rice

Peanut Rice

Rice

Coconut Rice

Rice

Peanut Masala Rice

Rice

Recipes for Shasti Special Pulagam