Home » Vegetarian » Capsicum Curry fry Recipe
క్యాప్సికమ్ ఫ్రై
కావలసిన వస్తువులు:
క్యాప్సికం :పావు కేజీ
పచ్చిమిర్చి : 5
ఉల్లిపాయ : 2
టమోటోసాస్: 4 స్పూన్లు
సోయాసాస్: 4 స్పూన్లు
చిల్లిసాస్: 4 స్పూన్లు
పసుపు : 1/4 స్పూన్లు
ఆవాలు :1/4 స్పూన్స్
జీలకర్ర :1/4 స్పూన్
వెల్లుల్లి : 4 రెబ్బలు
నూనె :3 స్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమిర : కొంచం
తయారీ:
క్యాప్సికమ్ ని కట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై అవి మెత్తబడేవరకు వేయించి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు(కొంచం చితకొట్టి వాడుకోవాలి) తగినంత ఉప్పు వేసి పది నిముషాలు వేయించాలి. ఇప్పుడు టమోటో సాస్, చిల్లీ సాస్, సోయాసాస్ వేసి ఇంకో ఐదు నిముషాలు వేయించుకుని చివరిలో కొత్తిమిర వేసుకుంటే రెడీ.....