Home » Pickles » Capsicum Chutney


 

 

క్యాప్సికం చట్నీ 

 

  

కావలసినవి :
క్యాప్సికం - అర కేజీ
మినపపప్పు- పావు కప్పు
ఆవాలు - రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 6
సెనగపప్పు- అరస్పూన్
చింతపండు-కొద్దిగా
ఉప్పు- తగినంత
ఇంగువ- అరస్పూన్
మెంతులు - ఒకటిన్నర స్పూన్
కరివేపాకు- కొద్దిగా
నూనె - అరకప్పు
పసుపు- అర స్పూన్ 

తయారీ:
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలిలో క్యాప్సికం ముక్కలను  నూనెలో వేసి  ఉడికించుకుని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా  నూనె పోసి కాగాక  కొద్దిగా ఆవాలు,  కొద్దిగా సెనగపప్పు,  కొద్దిగా మినపపప్పు,  రెండు ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి పోపుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.  అదే బాణలిలో నూనె వేయకుండా ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు చల్లారక వీటిని పౌడర్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.   ఇప్పుడు  క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు, ముందుగా చేసిపెట్టుకున్న పొడి మిక్సీలో వేసి చట్నీ లా  గ్రైండ్  చేసి గిన్నెలోకి తీసి పెట్టుకుని ముందుగా చేసి పెట్టుకున్న  తాలింపును కలిపి రైస్ తో కాని  టిఫిన్స్ తో కాని సర్వ్ చేసుకోవచ్చు...

 

 


Related Recipes

Pickles

టమాట కరివేపాకు పచ్చడి

Pickles

నిమ్మకాయ కారం పచ్చడి

Pickles

చింతపండు, ఉల్లిపాయ చట్నీ

Pickles

టమాటో చట్నీ!

Pickles

Allam Pachadi

Pickles

Dondakaya Roti Pachadi

Pickles

Tomato Karivepaku Pachadi

Pickles

Usiri Avakaya Recipe