Home » Vegetarian » Banana Peel Pulusu


 

 

అరటిపండు తొక్కతో పులుసు

 

 

 

అరటి పండు తొక్క తీసి అందరూ పారేస్తారు. కానీ వాటితో చక్కగా రుచికరమైన పులుసు చేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు ఆదా కావడంతోపాటు పోషక విలువలు వున్న రుచికరమైన పులుసు కూడా రుచి చూడొచ్చు.

 

కావలసినవి:

 

అరటిపండు తొక్కలు - ఆరు కాయలవి

చింతపండు - నిమ్మకాయంత

జీలకర్ర - 1 స్పూను

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - 2 రెబ్బలు

ఉల్లిపాయలు - 3

పచ్చిమిర్చి - 6

పసుపు - చిటికెడు

ఉప్పు, కారం - తగినంత

నూనె - 4 టీ స్పూన్లు.

 

తయారుచేయు విధానం: 

 

అరటి పండు తొక్కలను శుభ్రంగా కడగాలి. వాటిని తరిగి బాణలీలో కాస్త నూనే వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి కలిపి నూరుకోవాలి. ఇది ఒక ముద్ద అయ్యాక అరటికాయ తొక్కల ముక్కలు కూడా వాటిలో వేసి బాగా దంచుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకోండి. చింతపండు నీళ్ళలో నానబెట్టండి. ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కుని, నూరి ముద్దగా చేసుకోవాలి. బాణలీలో నూనె వేసి కాగిన తర్వాత తాలింపు వేసి ఉల్లిముద్ద, అరటి ముద్ద వేసి బాగా కలపాలి. తర్వాత చింతపండు పులుసు పోసి పోయండి. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి చిక్కబడేంత వరకు ఉంచి పొయ్యిమీద నుంచి దింపుకోవాలి.

 


Related Recipes

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Bendakaya Pulusu

Vegetarian

Vankaya Pachi Pulusu

Vegetarian

Vankaya Pachi Pulusu

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!

Vegetarian

Colourfull Vegetable Salad (Holi Special)

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk