Home » Vegetarian » vusirikaya curry (karteeka masam special)
ఉసిరికాయ పులుసు కూర
కావలసిన పదార్థాలు:
* ఉసిరికాయలు - 4 లేదా 6
* ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
* టమాటా ముక్కలు - 1/2 కప్పు
* పసుపు - 1/4 స్పూన్
* ఉప్పు - 1/2 స్పూన్
* పచ్చిమిర్చి - 2
* కారం - 1 స్పూన్
* ధనియాల పొడి - 1 స్పూన్
* జీలకర్ర పొడి - 1/2 స్పూన్
* నూనె - 3 or 4 స్పూన్స్
పోపు కొరకు:
* జీలకర్ర - 1/4 స్పూన్
* ఆవాలు - 1/4 స్పూన్
* ఎండుమిర్చి - 1
* కరివేపాకు
తయారీ విధానం:
ముందుగా ఉసిరి కాయల్ని కడిగి తుడిచి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి ఉసిరికాయల్ని వేసి.. దోరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా పగలుతాయి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకుని మిగతా రెండు చెంచాలు నూనె వేసి పోపు సామాగ్రి వెయ్యాలి. అవి వేగుతుండగా ఉల్లి, పచ్చిమిరపముక్కలు వేసి అన్నీ చక్కని రంగు వచ్చే వరకు వేయించుకుని, టమాటా ముక్కలు కలిపి.. వేయిస్తూ పసుపు కారం వేసి గరిటతో టమాటా ముక్కలు మెత్తగా నొక్కుతూ.. ఒక ముద్ద కూరలా అయ్యేలా ఉడికించుకోవాలి. నీరు కలిపి చక్కని గ్రేవీలా తినే రుచిని బట్టి పలుచగా చేసుకొని ఇప్పుడు ఉసిరికాయల్ని ఉడికే ఆ పులుసుకూర మిశ్రమంలో వేసి.. ధనియాల పొడి, జీలకర్ర పొడి జోడించి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర వేడి అన్నంతో నేతితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉసిరి ముక్కలకు పులుపు కారం ఉప్పు పట్టి చపాతి, రోటీలలో కూడా చాలా రుచిగా ఉంటుంది.
--Bharathi