Home » Sweets N Deserts » Vinayaka Naivedyam
వినాయక నైవేద్యం
ఉండ్రాళ్లు
కావలసినవి:
బియ్యపురవ్వ- కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
శనగపప్పు - అరకప్పు
జీలకర్ర - టీ స్పూన్
నూనె - మూడు టీ స్పూన్లు.
తయారి:
ముందుగా స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. దింపే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.
******
కుడుములు
కావలసినవి:
బియ్యపు రవ్య - గ్లాసు
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము - కప్పు
ఉప్పు - తగినంత
తయారి:
ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించాలి.
******
జిల్లేడుకాయలు
కావలసినవి:
బియ్యం రవ్వ - 2 కప్పులు
తరిగిన బెల్లం - కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు
గసగసాలు - టీ స్పూన్
బాదం, జీడిపప్పు పలుకులు
కిస్‌మిస్ - 2 టీ స్పూన్లు
నెయ్యి - కొద్దిగా
ఏలకుల పొడి - చిటికెడు
తయారి:
ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్ది నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని, వేయించిన గసగసాలు, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకొని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి.
******
బెల్లం తాలికలు
కావలసినవి:
బియ్యప్పిండి - గ్లాసు
బెల్లం - 2 గ్లాసులు
ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా
జీడిపప్పు, బాదం పలుకులు - తగినన్ని
ఏలకుల పొడి - చిటికెడు
తయారి:
ముందుగా గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి. ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి