Home » Vegetarian » Senaga Vadalu
శెనగలతో వడలు
కావాల్సిన పదార్థాలు:
* 1కప్పు - మొలకలు వచ్చిన శెనగలు
* 1 /4కప్పు - మైదా పిండి
* 1 /4కప్పు - ఉల్లి పాయ తరుగు
* 1 స్పూను - పచ్చి మిరపకాయ ముక్కలు
* 1 స్పూను - అల్లం తరుగు
* 1టీ స్పూను కారం పొడి
* 1 స్పూను కొత్తిమీర ఆకులు
* 1 స్పూను పుదీనా ఆకులు
* 4కరివేపాకు రెబ్బలు
* ఉప్పు తగినంత
* నూనె తగినంత
తయారు చేయు విధానము:
* ముందుగా మొలకలు వచ్చిన శెనగలు తీసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి.
* ఈ మిశ్రమానికి కొత్తిమీర, పుదీనా ఆకులు, కరివేపాకు రెబ్బలు, ఉప్పు , కారం వేసి కలపాలి.
* ఇప్పుడు, బాండీ లో నూనె వేసి సన్నటి సెగ మీద ఉంచాలి. నూనె మరిగాక, పప్పు రుబ్బిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు గా చేతికి తీసుకుని వడలు గా వేసుకోవాలి.
* ఈ వడలు వేడి వేడి గా స్నాక్స్ గా వడ్డిస్తే చాలా రుచిగా ఉండటమే గాక మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి.
--bhavana