Home » Sweets N Deserts » Semiya Chakkera Pongali (Navaratri Special)
సేమ్యా చక్కెర పొంగలి (నవరాత్రులు స్పెషల్)
కావలసిన వస్తువులు:
సేమ్య - 1 కప్పు ( నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి)
పెసరపప్పు_ 1/2 కప్పు
బెల్లం - 2 కప్పులు ( నీళ్ళల్లో కరిగించి వడగట్టి ఉంచుకోవాలి)
నెయ్యి- 1/2 కప్పు ( ఇచ్టమైనవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
ఏలక్కాయ పొడి- 1/2 టీ స్పూన్
జీడిపప్పులు, కిస్ మిస్ లు- నేతిలో వేయించి పెట్టుకున్నవి రెండు స్పూన్ల చొప్పున
పాలు- అరకప్పు ( ఇష్టమైనవారు వేసుకోవచ్చు)
తయారుచేసే విధానం:
బూరెల మూకుడు లో ఒక స్పూన్ నెయ్యి వేసి ముదు జీడిపప్పు, కిస్ మిస్ లూ వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆపైన అదే మూకుడులో సేమ్యా దోరగా, బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. వేయించిన సేమ్యా, పెసరపప్పు రెండింటినీ కలిపి కుక్కర్ లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. మరొక పాత్రలో బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి కరగనివ్వాలి. బెల్లం వాసన పోయేదాకా మరగనిచ్చి, ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న సేమ్యా, పప్పుల మిశ్రమం వేసి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. సేమ్యా, పప్పు బాగా ఉడికిన తర్వాత, ఇందులో మనకి కావలసినంత నెయ్యి, ఏలక్కాయ పొడీ, ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పు, కిస్ మిస్ లు కలిపి దింపుకోవాలి. ఇష్టమైన వారు ఇప్పుడు కాచి చల్లార్చిన చిక్కటిపాలని ఒక అరకప్పు కలుపుకోవచ్చు.
-వేదుల సుందరి