Home » Sweets N Deserts » Rakhi Special Gavvalu
రాఖీ స్పెషల్ - గవ్వలు
కావాల్సిన పదార్ధాలు..
* మైదా - 1 కప్పు
* బొంబేరవ్వ - 1/4 కప్పు
* బెల్లం - 1 కప్పు
* పాలు - 1/2 కప్పు
* నూనె - వేయించడానికి సరిపడా
* ఇలాచీ పౌడర్ - 1 చిటికెడు
తయారు చేసే విధానం:-
* ముందుగా మైదా, బొంబేరవ్వ కలిపి పోసి ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలిపి అందులో కొద్దిగా కాగిన నూనె పోసి పాలతో చపాతీ పిండిలా కలిపి ప్రక్కన మూతపెట్టి ఉంచుకోవాలి.
* ఇప్పుడు దళసరి గిన్నె (లేదా) పాన్ లో బెల్లంకి నీటిని జోడించి పాకంకోసం స్టవ్ పై పెట్టుకోవాలి.
* 10 నిమిషాలు నానిన గవ్వల పిండిని గుండ్రటి బాల్ లాగా చిన్నగా చేసుకుని గవ్వల బల్లపై నుండి క్రిందకు నొక్కాలి. అలా గవ్వలబల్ల లేనట్లైతే.... పోర్క్ తిరగేసి గవ్వలు చేసుకోవచు.
* అలా పిండి మొత్తం గవ్వలుగా చేసుకుని కాగే నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. పాకం నీటిలో వేస్తే దగ్గరపడేలా బెల్లన్ని ఉడికించి ఏలకుల పొడి జల్లి స్టవ్ ఆఫ్ చేసి గవ్వలను పాకంలో వేసి విరిగిపోకుండా చెంచాతో కలుపుతూ గవ్వలకి పాకం అంటేలాచూడాలి..... చాలారుచిగా ఉండే గవ్వలు... రెడీ.