Home » Sweets N Deserts » Paneer Kheer
పనీర్ తో ఖీర్
కావలసినవి:
పనీర్ - 100 గ్రాములు
నెయ్యి - అర కప్పు
బాదాం - పది
ఇలాచి పౌడర్ - అర స్పూన్
పాలు - అరలీటరు
కిస్మిస్ - 10
జీడిపప్పు - పది
పంచదార - ఒక కప్పు
తయారీ:
ముందుగా పాలను గిన్నెలోకి తీసుకుని మరిగించి తరువాత పనీర్ తురుము, వేసి ఉడికించాలి. ఇప్పుడు పంచదార వేసి చిన్నమంట మీద ఉడికించాలి.ఇలాచి పౌడర్ వేయాలి. తరువాత వేరొక స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నెయ్యి వేడి చేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.తరువాత పన్నీర్ మిశ్రమం చిక్కబడ్డాక అందులో వేయించి వుంచుకున్నజీడిపప్పులను సన్నగా కట్ చేసిపెట్టుకున్న బాదాంలను వేసి కలిపి ఫ్రిజ్ లో రెండుగంటల పాటు ఉంచి తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి...