Home » Non-Vegetarian » మటన్ పులావ్
మటన్ పులావ్
కావాల్సిన పదార్ధాలు:
బాసుమతి బియ్యం - పావు కేజీ
మటన్ - 300 గ్రా
నూనె/నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్స్
మటన్ ఉడికించడానికి నీరు - అర కప్పు
పులావ్ వండడానికి నీరు - ఒక కప్పు
దాల్చిన చెక్క - రెండు
లవంగాలు - ఆరు
యాలకులు - ఆరు
షాహీ జీరా - ఒక టీస్పూన్
నల్ల యాలుక - ఒకటి
బిరియానీ ఆకు - ఒకటి
ఉల్లిపాయలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - ఆరు
గరం మసాలా - ఒక టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
అల్లం వెల్లులి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్స్
రోజ్ వాటర్ - రెండు టేబుల్ స్పూన్స్
తయారీ విధానం:
* కుక్కర్ లో నూనె పోసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలుక, షాహీ జీరా, యాలకులు వేసి వేపుకోవాలి.
* అవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
* ఉల్లిపాయలు ఎర్రబడుతుండగా అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి.
* ఆ తర్వాత మటన్ వేసి 4-5 నిమిషాలు వేపుకోవాలి. వేపుకున్న మటన్‌లో కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు తగినన్ని నీళ్ళు పోసి మటన్ మెత్తగా ఉడక నివ్వాలి.
* మటన్ ఉడికిన తరువాత 1 కప్పు నీరు ఉంటుంది. అందులో నానబెట్టిన బియ్యం, ఉప్పు, మరో కప్పు కంటే కాస్త తక్కువ నీరు, వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి .
* 20 నిమిషాల తరువాత అడుగునుండి కలిపి మిర్చీ కా సాలన్ ఇంకా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి.