Home » Vegetarian » Lauki vadalu
లౌకి వడలు
కావలసిన పదార్ధాలు:
బియ్యంపిండి - ఒక కప్పు
ఆనపకాయ - ఒక చిన్నసైజు ముక్క
పచ్చిమిర్చి - 5
అల్లం - చిన్నముక్క
ఉప్పు - రుచికి తగినంత
వంటసోడా - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ విధానం:
ముందుగా ఆనపకాయను కోరుకొని పెట్టుకోవాలి (గ్రైండ్ చేయోద్దు నీరైపోతుంది). కోరిన తరువాత బియ్యం పిండిలో ఈ కోరును వేసి.. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పును కూడా గ్రైండ్ చేని ఈ మిశ్రమాన్ని కూడా బియ్యంపిండిలో వేసి కలపాలి. ఇప్పుడు బియ్యంపిండికి సరిపడినంత ఆనపకాయ తురుమును కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. (ఆనపకాయలో నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు). ఆఖరిలో ఒక రెండు చెంచాలు నూనె వేసి పిండి దగ్గరగా కలుపుకోవాలి వడల పిండిలా. ( గట్టిగా కాకుండా, మెత్తగా కాకుండా). ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పదినిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత ఓ కవర్ కి కాని చేతికి కాని కొంచం నూనె రాసుకొని వడలుగా వత్తుకొని నూనెలో వేసి వేయించాలి. వడలని బంగారు వర్ణం వచ్చేంతవరకూ వేయిస్తే చాలు ఎందుకంటే ఆనపకాయ తురుము ఉంది కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంటుంది. అంతే ఆనపకాయ వడలు(లౌకి వడలు ) రెడీ.
పిల్లలు ఎలాగూ ప్రత్యేకంగా సొరకాయతో చేసిన కూరలు తినరు కాబట్టి ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగానే తింటారు.
...రమ