Home » Sweets N Deserts » Kobbari Sweet Pongal (Navratri Special Day 1)
నవరాత్రులు మొదటిరోజు కొబ్బరి తీపి పొంగలి
రేపటి నుంచి నవరాత్రులు. అమ్మవారికి రోజుకి ఒక రకమైయిన తీపి చేసి నైవేద్యం పెడతాం కదా . రేపు ఉదయాన్నే పూజ చేసి ఆరగింపుగా ఈ కొబ్బరి పొంగలి చేసి చూడండి . అమ్మవారికే కాదు ఇంటిల్లి పాదికీ నచ్చే వంటకం ఇది.
కావలసిన పదార్దాలు:-
బియ్యం - ఒక కప్పు
పెసర పప్పు - ఒక కప్పు
బెల్లం - ఒక కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
నెయ్యి - పావు కప్పు
జీడిపప్పు - రుచికి తగినంత
కిస్మిస్ - తగినంత
తయారీ విధానం:-
1. ముందుగా కుక్కర్ లో బియ్యం , పెసరపప్పు , పోసి 6 కప్పుల నీళ్ళు పోసి ఉడికించుకోవాలి . 3 విసిల్స్ వచ్చాకా సిం లో ఓ పది నిముషాలు పెడితే మెత్తగా అవుతుంది .
2. అలా ఉడికిన అన్నం పప్పు మిశ్రమాన్ని బాగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బాణలి లో నెయ్యి వేసి జీడి పప్పు , కిస్మిస్ వేసి కొంచం వేగాక మెదిపిన అన్నం మిశ్రమం వేసి కలపాలి . ఆ తర్వాత బెల్లం తురుము కూడా వేసి ఉడికించాలి . ఇక దించే ముందు కొబ్బరి తురుము వేసి బాగా కదిపి స్టవ్ ఆపేయాలి . ఆ వేడికి కొబ్బరి లోని పచ్చిదనం పోతుంది.
కావాలంటే ఈ వంటకం లో పాలు కూడా పోసుకోవచ్చు రుచి కోసం.
- రమ