Home » Sweets N Deserts » Kobbari Korra Biyyam Payasam
కొబ్బరి కొర్ర బియ్యం పాయసం
(శ్రావణ శుక్రవారం స్పెషల్)
లక్ష్మీదేవి కి ఆరగింపుగా అన్నం పరమాన్నం పెడతాం కదా. అలానే కొర్ర బియ్యం పాయసం కూడా చేస్తారు . ఈ కొర్ర బియ్యం పాయసం లక్ష్మీదేవి కి ప్రీతి పాత్ర మయినది అంటారు .చేయటం కూడా చాలా సులువు. రుచి అద్బుతంగా వుంటుంది. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ఈ పాయసం ఆరగింపు పెట్టండి . కొర్రలు నూక అని అమ్ముతారు. సన్నగా బియ్యం రవ్వలా వుంటుంది. చిన్నగ్లాసు చేస్తే ఓ ఆరుగురికి సరిపోతుంది .
కావలసిన పదార్థాలు:
కొర్ర బియ్యం - చిన్న గ్లాసుతో
పాలు - అర లీటరు
పంచదార - నాలుగు గ్లాసులు
ఏలకుల పొడి - పావు చెమ్చా
జీడి పప్పు - సరిపడినంత
కిస్మిస్సు - సరిపడినంత
కొబ్బరి తురుము - చిన్న గ్లాసుడు
నెయ్యి - నాలుగు చెంచాలు
తయారీ విధానం:
ముందుగా కొర్ర బియ్యాన్ని ఒకటికి నాలుగు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టాలి. ఒక మూడు విజిల్స్ వచ్చాక ఆపి ..చల్లారాక ముందుగా కాచి పెట్టుకున్న పాలులో ఈ ఉడికించిన కొర్ర బియ్యం మిశ్రమాన్ని వేసి కలపాలి. ఒక్క ఉడుకు వచ్చాక పంచదార, లేదా బెల్లాన్ని వేసి కలపాలి. పదినిమిషాలు ఉడికితే చాలు. చివరగా దించేముందు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేయాలి. నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ వేసి వేయించి పాయసంలో కలపాలి.
- రమ