Home » Sweets N Deserts » Gulab Jamun Recipe
గులాబ్ జామూన్
కావలసినవి:
గులాబ్ జామూన్ ప్యాకెట్ : ఒకటి
పంచదార : అర కేజీ
యాలుకలపొడి : ఒక స్పూన్
నూనె : తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా గులాబ్ జామూన్ ప్యాకెట్ కట్ చేసి పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి. ఆ పిండిని ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. పక్కనే మరో స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి. ఆ పాకంలో యాలుకల పొడి కలుపుకోవాలి. తరువాత కలిపిన పిండిని తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి. అలా వేగిన ఉండల్ని తీసి పాకంలో వెయ్యాలి. పది నిమిషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జామూన్లు తినటానికి రెడీగా ఉంటాయి. రుచికరమైన గులాబ్ జామూన్ల తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామూన్‌లు మృదువుగా ఉంటాయి. అలాగే పిండిని కలిపే సమయంలో జీడిపప్పులను పొడిగా కొట్టి కలిపితే రుచితో పాటు వెరైటీగా ఉంటాయి.