Home » Sweets N Deserts » Goru Meetilu (Navratri Special Day 3)
నవరాత్రులు మూడవరోజు (గోరు మీటీలు)
కావలసిన పదార్దాలు:
మైదా - 1 గ్లాస్
బొంబాయి రవ్వ - 4 చెంచాలు
బటర్ - 2 చెంచాలు
ఉప్పు - కొద్దిగా
చెక్కర, లేదా బెల్లం - 1 1 /2 గ్లాసు
ఇలాచీపొడి - 1/4 స్పూను
తయారీ విధానం:
* మైదాలో బొంబాయి రవ్వ ఉప్పు కలిపి బటర్ వేడి చేసి పూర్తిగా కరిగాక ఈ పిండిలో వేసి కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి.
* దానిని 20ని" పాటు మూతపెట్టి నానబెట్టాలి. ఇలాచీపొడి కొట్టి ఉంచుకోవాలి. /p>
* ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దని చిన్న ఉండలుగాచేసుకొని... వాటిని కోలగా బలపంలా చెయ్యాలి.
* ఈ బలపాలు మన మధ్య వేలు పొడవు మందంగా ఉండాలి. వాటి మద్య పై నుంచి క్రిందని నొక్కి నూనె చేతితో మొదటి రెండు వేళ్ళు బయటి వైపును.. బోటకనవేలు లోపల నొక్కుతూ గోరుతో మీటాలి.
* ఇవి చాలా అందంగా నున్నగా వస్తాయి. ఇలా చేసుకున్నవి ప్రక్కన ఉన్న పేపరుపై ఉంచుకొని మరోటి చేసుకోవాలి. ఇలా మొత్తం గోరు మీటీలు తయారుచేసుకున్నాక వేడి నీటిలో దోరగా వేయించుకోవాలి.
* పూర్తిగా లోపల నుండి వేగాక పేపరు పైకి తీసుకుంటే నూనె పూల్చేసుకున్నక చెక్కర లేదా బెల్లం తీగపాకం వచ్చాక ఇలాచీపొడి జల్లి ఈ గోరు మీటీలు ఒకొక్కటిగా పాకంలో వేస్తూ అటు ఇటు అవి విరిగి పోకుండా తిప్పుతూ పాకం పూర్తిగా వాటిపై అంటుకునేలాచూడాలి.
* చల్లారాక డబ్బాలో సర్దుకోవాలి. ఇవి చూడటానికి చాలా బావుంటాయ. రుచి ఇంకా బావుంటుంది.
- భారతి