Home » Pickles » Gongura Pachadi (Atla Taddi Special)
గోంగూర పచ్చడి (అట్లతద్ది స్పెషల్)
కావలసిన పదార్థాలు:
గోంగూరకట్టలు - 4 లేదా 5
ఎండుమిర్చి - 10
పచ్చిమిర్చి - 5
వెల్లుల్లి - 6 రెబ్బలు
జీలకర్ర - 1 స్పూను
మెంతులు - అర చెంచా
ధనియాలు - అర స్పూను
చింతపండు - కొద్దిగా
ఉప్పు - 1 స్పూను
పసుపు - అర స్పూను
నూనె - పావు కప్పు
పోపుగింజలు - శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు
తయారు చేయు విధానం:
ముందుగా గోంగూర ఆకులు కడిగి.. పొడి బట్టమీద ఆరబెట్టుకోవాలి. బాణలిలో నూనెపోసి అందులో మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ధనియాలు కూడా వేసి వేగాక పోపు తీసి ప్రక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో నూనెవేసి గోంగూర ఆకులు వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉప్పు, పసుపు వేసి నూనెలో మగ్గనిచ్చి.. పొయ్యిమీద నుండి మగ్గి దగ్గర పడ్డాక దింపి కొద్దిగా చింతపండు కలపాలి. అది చల్లారేలోగా పోపు మిరపకాయలు అన్నింటిని పొడిచేసుకుని అందులో ఈ గోంగూర ముద్దవేసి ఒకటి రెండు సార్లు అలా మిక్సీలో తేలిగ్గా రుబ్బాలి. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఉంటే బావుంటుంది. పై పోపుకి బాణలిలో నూనె పోసి, ఎండుమిర్చి, మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వెల్లుల్లి... వేయించి... పచ్చడిపైన వెయ్యాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నిల్వ కూడా ఉంటుంది.
- భారతి