Home » Sweets N Deserts » Dasara Special Recipes

 

 

Dasara Special Recipes

పెసరపప్పు పొంగలి 

 

 

కావలసిన పదార్థాలు:

బియ్యం: 1cup,

పెసరపప్పు: 1cup,

బెల్లం: 2cup,

నీళ్ళు: 4.5cups,

జీడిపప్పు: 10,

కిస్‌మిస్‌: 10,

ఎండుకొబ్బరి ముక్కలు: 1/2cup,

ఏలకుల పొడి: 1/2tsp,

నెయ్యి: 1/2cup.

 

తయారు చేయు విధానం: 

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి మొత్తాన్ని వేసుకోవాలి. ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలిపాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్‌ పెసర పప్పు పొంగలి రెడీ.

 

బాదం పాయసం

 

 

 

కావలసిన పదార్థాలు: 

బాదం పప్పులు: 1cup,

పాలు: 6cups,

పంచదార: 1cup,

కుంకుమ పువ్వు: కొద్దిగా,

నీళ్లు: ఒక గ్లాసు.

 

తయారు చేయు విధానం: 

ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి ఒక గంట పాటు నాననివ్వాలి. తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేయాలి. తర్వాత బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. అవసరం అయితే పాలు వేసుకోవాలి. తరువాత బాదం పేస్టును పాన్‌లో వేసి 5- 10 నిమిషాలు వేడి చేయాలి. తరువాత అందులో చక్కెర వేసి ఇంకొంచెం సేపు వుంచాలి. అది చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం వేసి ఉడికించాలి. దీనిపైన కుంకుమపువ్వుతో అలంకరించాలి. రుచికరమైన బాదం పాయసం రెడీ..

 

పూర్ణం భక్షాలు

 

 

 

కావలసిన పదార్థాలు: 

శెనగపప్పు: 1/2cup

మైదా: 1/2kg

ఏలకులు: 6

నెయ్యి: 1cup

వంటసోడా: చిటికెడు

పాలిథీన్‌ కవర్‌: 1

బెల్లం: 1/2kg

నూనె: సరిపడా

ఉప్పు: చిటికెడు

 

తయారు చేయు విధానం: 

ముందుగా వెడల్పుగా ఉన్న ప్లేట్ లో మైదా జల్లించి దానికి వంటసోడా, ఉప్పు కలపాలి. అందులో నెయ్యి వేసి నీళ్లు పోసి జారుగా కలపాలి. ఈ మైదాకు మధ్యలో గుంట చేసి కప్పు నూనె పోసి ఆకు మూత పెట్టాలి. నీరు మరిగించి శనగపప్పుకి బెల్లం, ఏలకుల పొడి కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దని మనకి నచ్చినంత సైజు ఉండలు చేయాలి. నానిన మైదా ముద్దని నూనె పూసిన పాలిథీన్‌ కవరు మీద పరిచి, శెనగపప్పు బెల్లం ముద్దని మధ్య పెట్టి చుట్టూ మూసి భక్ష్యాన్ని పల్చగా వత్తి దళసరిపెనం మీద నెయ్యితో మాడకుండా కాల్చాలి. అతిధులకు ఇవి వడ్డిస్తే తినేందుకు ఎంతో రుచికరంగానూ వుంటాయి. అయితే వీటిని మాడనివ్వకుండా శ్రద్ధ వహించాలి.

 

 

సగ్గు బియ్యం వడలు

 

 

 

కావలసిన పదార్థాలు: 

సాబుదానా (సగ్గుబియ్యం): 1cup

ఆలూ: 1(ఉడికించి పొట్టుతీసినది)

పచ్చిమిర్చి: 8

ఉప్పు: రుచికి సరిపడ

నూనె: వేయించడానికి సరిపడ

 

తయారు చేయు విధానం: 

ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి కడగాలి. తరువాత అందులో నీళ్లు పోసి 2-3 గంటలు నాననివ్వాలి. నానిన తరువాత సగ్గుబియ్యం, ఆలూ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ ఒక బౌల్‌ లో వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి. సన్నని మంట మీద నూనెను వుంచి వీటిని అందులో వేసి నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ప్లేటులో పేపర్‌ నాప్‌కిన్‌ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి. ఎక్కువగా వున్న ఆయిల్‌ అది పీల్చుకుంటుంది.

 

రవ్వ బొబ్బట్లు

 

 

 

కావలసిన పదార్ధాలు: 

రవ్వ: 1cup

మైదా: 2cups

గోధుమ పిండి: 1/2cup

పంచదార: 2cups

సోడా: చిటికెడు

నెయ్యి: 2tsp

నూనె: 1/2cup

 

తయారు చేయు విధానం:

ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు, వంట సోడా వేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించి ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూతా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతోలేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.