Home » Sweets N Deserts » Chitti Kajalu
చిట్టి కాజాలు
ఏ పండగొచ్చినా స్వీట్లు చేసుకుంటేనే నిండుదనం వచినట్టు. మరి ఉగాది దగ్గరకొచ్చేస్తోంది తొందరగా, తేలికగా అయిపోయే స్వీట్లు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కదూ. అందుకే ఈ రోజు చిట్టి కాజాలు ఎలా తయారుచెయ్యాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు:
మైదా - 1 కప్పు
పంచదార - 1 1/2 కప్పు
వరిపిండి - 3 చెంచాలు
యాలకుల పొడి - 1 చెంచా
నెయ్యి - 4 చెంచాలు
నూనే - వేయించటానికి సరిపడా
తయారి విధానం:
ఈ చిట్టి కాజాల కోసం ముందుగా ఒక డిష్ లో జల్లించిన మైదా తీసుకుని అందులో నెయ్యి వేసి పిండి అంతా అంటేలా కలుపుకోవాలి. తరువాత దానిలో నీళ్ళు కలుపుతూ చపాతీపిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని గంట సేపు నాననివ్వాలి. ఆ లోపు పంచాదార మునిగేలా నీళ్ళు పోసుకుని తీగ పాకం వచ్చేదాకా కదుపుతూ ఉండి తరవాత స్తవే ఆపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు నానిన పిండిని చపాతిలా వత్తుకుని దాని మీద నెయ్యి రాసి వరిపిండి చల్లుకోవాలి. దానిని చాపలా చుట్టి అంచులను నీళ్ళతో తడిపి పూర్తిగా మూసేయాలి. చాపలా చుట్టిన దానిని ఒక అంగుళం వెడల్పుగా ముక్కలు కోసుకోవాలి. అన్ని ముక్కలని అలా కోసుకున్నాకా ఒక్కొక్కదాన్ని చపాతి కర్రతో మెల్లిగా ఒకసారి వత్తాలి లేదా మన వేలుతో కాజా షేప్ వచ్చేలా అదమాలి. వాటిని నునె కాగాకా సిమ్ లో పెట్టి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. వరిపిండి వేసి చుట్టటం వల్ల అవి మద్యలో పొరలుగా విచ్చుకుంటాయి. అలా వేగిన కాజాలను పాకంలో వేసి కాసేపు ఉంచి తీసెయ్యాలి. పాకంలో ఇష్టమైనవాళ్లు యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇలా చేసిన చిట్టి కాజాలని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారాకా తినటమే. పండగకి ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా పెట్టచ్చు.
- కళ్యాణి