Home » Non-Vegetarian » బ్రోకలీ 65 రెసిపి
బ్రోకలీ 65 రెసిపి
కావాల్సిన పదార్థాలు:
బ్రోకలీ- 1 పువ్వు
మైదా -అరకప్పు
మొక్కజొన్న పిండి- పావుకప్పు
బియ్యంపిండి-పావుకప్పు
శనగపిండి-పావుకప్పు
కారంపొడి-ఒకస్పూన్
గరం మసాలా-హాఫ్ టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పెరుగు- 2టేబుల్ స్పూన్లు
నీళ్లు- పావు కప్పు
నూనె-వేయించడానికి సరిపడినంత
తయారీ విధానం:
- ముందు బ్రోకలీని శుభ్రంగా కడుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీటిలో కాస్త ఉప్పు వేసి ఈ బ్రోకలీ ముక్కలు అందులో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
-పూర్తిగా ఉడికించడకూడదు. తర్వాత ఒక వెడల్పు గిన్నె లో అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాల, మైదా, మొక్కజొన్న, బియ్యంపిండి, కారంపొడి, ఉప్పు వేసి కొన్ని నీళ్లు ఒక థిక్ పేస్ట్ తయారు చేయాలి.
- ఆ పిండిలో ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రోకలీని వేసి...కలిపాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కో పీస్ వేసుకుంటూ వేయించాలి.
-బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టాలి. అంతే సింపుల్ బ్రోకలీ 65 రెడీ. చల్లటి సాయంత్రం వేళ టీతో కానీ కాఫీతో కానీ వీటిని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.