Home » Sweets N Deserts » Bread Rasmalai
బ్రెడ్ రసమలై
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లయిసెస్ - ఐదు
పాలు - నాలుగు కప్పులు
మిల్క్ మెయిడ్ - ఒక కప్పు
చక్కెర - ఐదు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా
కుంకుమ పువ్వు - చిటికెడు
సన్నగా తురిమిన జీడిపప్పు, బాదం, పిస్తా - రెండు చెంచాలు
తయారీ విధానం:
బ్రెడ్ స్టయిసెస్ ని గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు, చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. గిన్నెకు అంటుకునే విధంగా అయ్యేవరకూ పాలను మరిగించి, మిల్క్ మెయిడ్ వేయాలి. అడుగంట కుండా కలుపుతూ మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. చెంచాడు పాలలో కుంకుమ పువ్వును కలిపి మిశ్రమంలో వేయాలి. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఓ బౌల్ లో బ్రెడ్ స్టయిసెని వేసి పైన ఈ మిశ్రమం వేయాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి.
-Sameera