Home » Sweets N Deserts » Bellam kudumulu (Vinayaka chathurti special)
బెల్లం కుడుములు (వినాయక చవితి స్పెషల్)
కావాల్సిన పదార్ధాలు:-
1కప్పు - బియ్యం పిండి
1కప్పు - నీళ్లు
2స్పూన్లు - పెసర పప్పు
1/2స్పూను - ఇలాచీ పొడి
1/2కప్పు - కొబ్బరి తురుము
1కప్పు - బెల్లం తురుము
నెయ్యి - తగినంత
తయారుచేయు విధానం:-
* ముందుగా పెసరపప్పు నానబెట్టాలి . ఆ తరువాత బాండీ లో బెల్లం తురుము వేసి, అరకప్పు నీళ్లు వేసి కలుపుతూ, పాకం తయారు చేసుకోవాలి. పాకం చక్కగా మరుగుతున్నప్పుడు, స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు, ఈ పాకానికి, బియ్యం పిండి, నానబెట్టిన పెసర పప్పు, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి నెమ్మదిగా ఉండలు కట్టకుండా కలుపుతూండాలి. రెండు, మూడు చెంచాల నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉండాలి.
* ఇప్పుడు ఈ పిండిని , చిన్న చిన్న ఉండలు గా చేసుకుని, ఆవిరిపై ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్ పై వెయిట్ లేకుండా లేదా, ఎలక్ట్రిక్ కుక్కర్ లో గాని ఉడికించవచ్చు.
* వినాయక చవితి గణేశుడి నైవేద్యానికి, బెల్లం కుడుములు రెడీ.
-Bhavana