Home » Rice » బీట్రూట్, పన్నీర్ పులావ్
బీట్రూట్, పన్నీర్ పులావ్
కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం -1/2 కప్పు ( కడిగి నానబెట్టుకోవాలి)
మీడియం సైజు బీట్రూట్ - తురిమి పక్కన పెట్టుకోవాలి.
పన్నీరు - 100 గ్రాములు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 7
ఉల్లిపాయ - 1పెద్దది ( తరిగి పక్కన పెట్టుకోవాలి)
జీడిపప్పు - 10 ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
ఎర్రమిరపపొడి - 1 టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
పుదీనా ఆకులు - కొన్ని
ఉప్పు - రుచికి సరిపడా
చిల్లీ ఫ్లేక్స్
ఇప్పుడు తయారీ విధానం చూద్దాం:
- ముందుగా స్టౌ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టాలి.
- అందులో నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
- తర్వాత అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టాలి.
- తర్వాత బీట్రూట్, పన్నీరు ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా పొడి , పుదీనా ఆకులు, ఉప్పు , ఎండుమిరపపొడి వేసి బాగా కలియబెట్టాలి.
- ఇప్పుడు కడిగి పక్కనపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసి కలపాలి. అందులో 1.5 కప్పుల నీళ్లతోపాటు ఉప్పు వేయాలి. మూత పెట్టి మీడియం మంట మీద 20 నిమిషాలపాటు ఉంచాలి.
మూత తీసి పులావ్ రెడీ అయినట్లు అనిపిస్తే పక్కకు దించేయాలి.
లేదంటే కాసేపు మంటమీద అలాగే ఉంచాలి. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ పన్నీర్ పులావ్ రెడీ అయినట్లే. ఇది చూడటానికి ఎంతో బాగుంటుంది.
బీట్రూట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, అలసటతో బాధపడుతున్నవారికి ఇది చాలా మంచిది.
ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ పన్నీర్ పులావ్ రెడీ అయినట్లే. ఇది చూడటానికి ఎంతో బాగుంటుంది. బీట్రూట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, అలసటతో బాధపడుతున్నవారికి ఇది చాలా మంచిది.