Home » Sweets N Deserts » Atukulu Uppu Kudumulu
అటుకులు ఉప్పు కుడుములు
వినాయక చవితి నాడు బొజ్జ గణపయ్యకు వండే రుచికరమైన వంటకాల్లో అటుకులు ఉప్పు కుడుమలు ఒకటి. ఈసారి ఈ కుడుములను తయారుచేసి నైవేథ్యంగా పెట్టండి. ఇప్పుడు వాటి తయారీ ఎలాగో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
* అటుకులు - 1/2 కేజీ
* కొబ్బరికాయ - 1
* నానా పెట్టిన పచ్చి శెనగపప్పు - 1 కప్పు
* పాలు - 1/4 లీటరు
* నెయ్యి - 50 గ్రామ్స్
* జీలకర్ర - 2 టీ స్పూన్స్
* ఉప్పు - గినంత
* మిరియాల పొడి - చిటికెడు
తయారీ విధానం:-
* ముందు కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి
* ఆ తరువాత అటుకుల్ని మిక్సర్ గ్రైండర్ లో వేసుకొని పొడిగా చేసుకోవాలి
* ఒక గిన్నెలో తురుముకున్న కొబ్బరి, నెయ్యి, పాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మిరియాల పొడి, సరిపడా ఉప్పును వేసి అందులో కొంచెం నీళ్లు పోసి గట్టి ముద్దలా కలుపుకోవాలి.
* తరువాత వాటిని ఉండలుగా చుట్టి కుక్కర్లో పెట్టి ఓ విజిల్ వచ్చే వరకూ ఉడికించి దించుకోవాలి.