Home » Vegetarian » Masala vankaya recipe
మసాలా వంకాయ రెసిపి
కావలసిన పదార్థాలు
వంకాయలు. - పావు కేజీ ( చిన్నవి)
ఇంగువ.- చిటికెడు
పసుపు. 1/2 టీస్పూన్
ఆవపొడి. 1.1/2 టీస్పూన్
సోంపు పొడి. 1 టీస్పూన్
కొత్తిమీర పొడి. 1 టీస్పూన్
లవంగాలు. - 5
పలావు ఆకులు-. 2
మెంతిపొడి. 1 1/2 టీస్పూన్
కారం. 2 టీస్పూన్
ఎండుమామిడి పొడి. 2 టీస్పూన్
ఉప్పు. తగినంత
జీలకర్రపొడి. - 1 టీస్పూన్
నూనె. - అర కప్పు
తయారు చేయు విధానము :
ముందుగా వంకాయల్ని బాగా కడిగి వాటిని గుత్తివంకాయకూరకు కోసినట్లుగా కట్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి.ఒక గిన్నెతీసుకుని ఆవపొడి,సోంపు పొడి, ఎండుమామిడి పొడి,జీలకర్రపొడి,కొత్తిమీర పొడి, మెంతిపొడి వేసి కలిపి అందులోనే ఉప్పు, కారం కూడా వేసి ఈ మిశ్రమాన్నిఅంతా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులోనూనె వేసి వేడయ్యాక లవంగాలు, పలావు ఆకులు, ఇంగువ వేసి ఇప్పుడు స్టఫ్ఫింగ్ చేసుకున్నవంకాయల్ని కూడా వేసి ఒక పది నిముషాలు మూతపెట్టి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.