సూజీ పాన్ కేక్స్
కావాల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు
టమాట తరుగు 1/2 కప్పు
అల్లం ముక్కలు (సన్నగా తరిగినవి) – 1 స్పూను
పచ్చిమిర్చి ముక్కలు – 1/2 స్పూను
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
వంటసోడా – చిటికెడు
తయారి విధానం:
బొంబాయి రవ్వలో పెరుగు వేసి అందులో చిటికెడు వంటసోడా,ఉల్లిపాయ తరుగు,టమాటా తరుగు,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం ముక్కలు,కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. కావాలంటే కొంచం నెలలు పోసుకోవచ్చు. మరీ దోసలపిండి అంట పల్చగా కాకుండా చూసుకోవాలి. అల నానిన పిండిని స్టవ్ మీద వేడెక్కిన పెనం మీద కొంచం మందంగా ఒక గరిటెడు పిండి వేయాలి. బంగారపు రంగులో కాలేదాకా ఉంచి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. కరకరలాడుతూ రుచిగా ఉండే బొంబాయి రవ్వ పాన్ కేకులు వేడిగా తింటేఎంతో రుచిగా ఉంటాయి.
...కళ్యాణి