స్ట్రాబెర్రీ మిల్క్ షేక్

 

కావల్సిన పదార్థాలు:

స్ట్రాబెర్రీ పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు

చల్లటిపాలు - రెండు కప్పులు

స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ - నాలుగు స్కూపులు

పంచదార - రుచికి తగినంత

తాజా స్ట్రాబెర్రీలు - 6

 

తయారు చేయడం:

ముందుగా స్ట్రాబెర్రీలను కడగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత జార్‌లో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్‌ చేయాలి.

తరువాత గ్లాసుల్లోకి పోసి, స్ట్రాబెర్రీలతో గార్నిష్‌ చేసి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.

పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ను ఈ వేసవిలో తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.

ఈ వేసవిలో బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చాలా సులభంగా ఈ విధంగా చేసి సర్వ్‌ చేయచ్చు.