స్ట్రాబెరి లెమనైడ్

 

 

కావలసిన పదార్థాలు:

స్ట్రాబెరి - 4

నిమ్మకాయ - 1

చక్కెర - 2 టేబుల్ స్పూన్స్

నీళ్ళు - సరిపడా

ఐస్ క్యూబ్స్ - 4

 

తయారుచేసే విధానం:

ముందుగా స్ట్రాబెరీలను మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఒక గిన్నెలో నిమ్మకాయ రసం పిండి, చక్కర, నీళ్ళు వేసి, చక్కర కరిగేవరకు కలపాలి. ఈ నిమ్మకాయ నీళ్ళను ఒక అరగంట పాటు ఫ్రిజ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకొని, దానిలో 2 టేబుల్ స్పూన్ల స్ట్రాబెరి గుజ్జును వేయాలి. ఫ్రిజ్జ్ లో చల్లబరచిన నిమ్మకాయ నీళ్ళను ఈ గ్లాసులో పోసి, పైన ఐస్ క్యుబ్స్ వేయాలి. మండు వేసవిలో చల్లని స్ట్రాబెరి లెమనైడ్ రెడీ.