పుదీనా బటర్  మిల్క్  షర్బత్

 

 

ఎండలు కాస్త ఎక్కువయ్యేసరికి దాహం పెరిగిపోయి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. కూల్డ్రింక్స్, సోడా ఇలాంటివి తాగిన దాహం తీరుతుందే కాని మళ్లీ కాసేపటికి మల్లి అదే పరిస్థితి. అందుకే చక్కగా దాహం తీరి ఆరోగ్యానికి కూడా మేలు చేసే పుదినా షర్బత్ ఎలా చెయ్యాలో తెలుసుకుని అది రోజూ తాగుదాం.


కావాల్సిన పదార్థాలు:

పెరుగు - 2 కప్పులు

పుదీనా - 1/2 కట్ట

కొత్తిమీర - 1/4 కట్ట

వెల్లుల్లి రెబ్బలు - 2

పచ్చిమిర్చి - 2

నిమ్మ చెక్క - 1

ఉప్పు తగినంత


తయారి విధానం:

ముందుగా ఒక లోతైన గిన్నెలో పెరుగు వేసి 2 గ్లాసుల నీళ్ళు పోసి గిలక్కొట్టి పక్కన ఉంచుకోవాలి. మిక్సి జార్లో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకుని కొన్ని నీళ్ళు పోసి మెత్తగా చేసుకోవాలి. ఆ పేస్టుని మజ్జిగలో వేసి తగినంత ఉప్పు, నిమ్మరసం జోడించి బాగా కలుపుకోవాలి. కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తరువాత బయటకి తీసి తాగితే చల్లగా, హాయిగా ఉంటుంది. కావాలంటే మీరూ  ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో.

- కళ్యాణి