పూరి రెసిపి
కావలసిన వస్తువులు:
గోధుమపిండి - అరకిలో.
పాలు - చిన్న కప్
నూనె - వేయించడానికి సరిపడా
వెన్న - 2 స్పూన్లు
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం:
ముందుగా గిన్నెతీసుకుని అందులో పిండి, పాలు, ఉప్పు, వెన్న వేసి బాగా కలపాలి.
పూరీలు మెత్తగా రావాలంటే అందులో కొంచం అరటి పండు గుజ్జు వేస్తే రుచిగాను, మెత్తగాను కూడా వస్తాయి.కలుపుకున్న పిండిని కనీసం ఒక 45 నిముషాలైన నానబెట్టాలి.
తరువాత స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుని నూననె వేసుకుని మరిగించాలి.
ఇంతలో నానబెట్టుకున్న పిండిని ఉండల్లా చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి.
పూరీలని ఆలూ కర్రీ తో తింటే చాలా బావుంటుంది.