పైనాపిల్ మిల్క్ షేక్

కావలసిన పదార్థాలు:

పైనాపిల్: 1

పాలు: 2cups

పంచదార: 1/2cup

వెన్నీల ఐస్ క్రీం: 1tbsp

ఐస్ క్యూబ్స్: 2

యాలకుల పొడి: 1tsp

తయారు చేయు విధానం:

1. పైనాపిల్ పై తొక్కును తీసివేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి.

2. తర్వాత రెండు కప్పుల పైనాపిల్ రసానికి, రెండు కప్పుల పాలు, చక్కెర కలిపి మళ్లీ మిక్సీలో వేయాలి.

3. దానిని ఓ గ్లాస్ లో పోసి అందులో వెన్నీల ఐస్ క్రీం, ఐస్ క్యూబ్స్ యాలకుల పొడిని కలిపి కంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తాగితే వేసవి దాహం చక్కగా తీరుతుంది.