ఆరెంజ్ ఐస్ క్రీం

 

 

కావలసిన పదార్ధాలు:

ఆరెంజ్ జ్యూస్ - 2 కప్పులు

ఆరెంజ్ మరమలాడ్ - 4 స్పూన్స్

క్రీం - 1 కప్పులు

పాలు - 2 కప్పులు

పంచదార - 200 గ్రా 

కండెన్స్ డ్ మిల్క్ - 1 టిన్ను

ఎగ్ వైట్ - 4 ఎగ్స్ ది

కమలా తొనల ముక్కలు - 1 కప్పు 

 

తయారుచేయు విధానం:

ముందుగా ఒక బౌల్ లో పంచదార, మరమలాడ్ వేసి బాగా కలిపి పావుగంట పాటు ప్రక్కన వుంచాలి.


కండెన్స్ డ్ మిల్క్ ను  బాగా బీచ్ చేసి క్రీం కలిపి అంత కలిసేలా మళ్ళీ బాగా బీట్ చెయ్యాలి.


ఈ మిశ్రమానికి మరమలాడ్ మిశ్రమం, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా బీట్ చెయ్యాలి.


ఎగ్స్ పగలగొట్టి దాంట్లోనే ఎగ్ వైట్ ని బాగా కలిపి మిల్క్ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టి పూర్తిగా గట్టిపడేవరకు ఉంచాలి.


సర్వ్ చేసే ముందు తీసి ఐస్ క్రీం బౌల్స్ లో పెట్టి పైన కమలా తొనల ముక్కలు వేసి కూల్ గా సర్వ్ చెయ్యాలి.