లెమన్ స్క్వాష్
కావలసినవి:
నిమ్మకాయలు - 1/2 కేజీ
పంచదార - అరకేజీ
నిమ్మ ఉప్పు - 1 స్పూను
పొటాషియం మెటాబైసల్ఫేట్ - 1/4 స్పూను
నీరు - సరిపడా
తయారీ:
ముందుగా నిమ్మకాయలు తరిగి రసం తీయాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని సరిపడా నీళ్ళు పోసి పంచదార ,నిమ్మ ఉప్పు కలిపి సన్నని స్టవ్ సెగపై వేడి చేయాలి. తీగ పాకం వచ్చిన తరువాత దించి నిమ్మకాయ రసం కలపాలి. పొటాషియం మెటాబైసల్ఫేట్‌ని కొంచెం వేడి నీళ్ళలో కలిపి సిరప్ లో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి వారం రోజులు నిల్వ ఉంచుకుని తరువాత ఒక గ్లాసు నీటిలో రెండుస్పూన్ల లెమన్ స్క్వాష్ కలుపుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి.