ఫ్రూట్‌ ఐస్ క్రీమ్

 

 

 

కావలసిన పదార్థాలు:

ఫైనాఫిల్ జ్యూస్‌ - ఒక కప్

బత్తాయి జ్యూస్ - ఒక కప్

దానిమ్మ గింజల జ్యూస్ - ఒక కప్

వెనీలా ఐస్‌క్రీం - ఒక కప్

 లెమన్ సోడా

చెర్రీస్ - ఒక కప్

 

తయారీ విధానం:

బౌల్ లోనికి బత్తాయి, ఫైనాఫిల్, దానిమ్మ జ్యూస్‌ లను తీసుకుని బాగా కలపాలి. జ్యూస్ గ్లాసులను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్‌క్రీం వేయాలి.

ఆ గ్లాసులను పండ్ల రసం, నిమ్మ సోడా తో నింపాలి. చెర్రీపండ్లతో డెకరేట్ చేసుకుని తింటే చాలా బావుంటుంది.