బ్రెడ్ చీస్ టోస్ట్
పిల్లలు కి ఒకే రుచి నచ్చదు. కాబట్టి ఎప్పటికప్పుడు అమ్మ తన క్రియేటివిటీ కి పని చెప్పాల్సిందే . అందులోను స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కి స్నాక్స్ రెడీ చేయటం ..ఒక పరీక్ష అనే చెప్పాలి. వాళ్ళు పేచి పెట్టకుండా తినే ఐటమ్స్ చేయటం అంటే మాటలా ? పైగా ఇంట్లో మనకి అందుబాటులో వుండే వాటితో. అదిగో అలాంటప్పుడే కాస్త క్రియేటివ్ గా ఆలోచించి , ఆలోచించి కొన్ని ప్రయోగాలు చేస్తుంటా. అవి మా పిల్లలకి నచ్చి ..నేను పాస్ అవ్వగానే అమ్మయ్య అనుకుంటా. అలా మా పిల్లలు ఇష్టపడ్డ ఓ స్నాక్ ఐటమ్ గురించి చెప్పబోతున్నా ఈ రోజు. నేను బ్రెడ్ చీస్ టోస్ట్ అని పేరు పెట్టా..మీరు అందులో చేర్చే ఐటమ్స్ బట్టి మీరే నామకరణం చేయండి ఆ స్నాక్ కి . బేసిక్ గా ఈ టోస్ట్ కి కావలసిన పదార్థాలు చెబుతున్నా..వాటిని మీ పిల్లల టేస్ట్ బట్టి మార్చుకోవచ్చు .
కావలసిన పదార్ధాలు
బ్రెడ్ - ఒక ప్యాకెట్
చీస్ - చిన్న కప్పుతో
టమాటలు - ఒక మూడు
కాప్సికం - ఒక మూడు
స్వీట్ కార్న్ - చిన్న కప్పుతో
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి - రుచికి తగినంత
కాబాజి ఆకులు - ఒక అయిదారు
కొత్తిమీర - ఒక కట్ట
మిరియాల పొడి - పావు చెంచా
మసాలా పొడి - పావు చెంచా
తయారి విధానం
1 . ముందుగా బ్రెడ్ స్లైస్ లని విడి విడి గా ఒక ప్లేట్ లో అరేంజ్ చేసుకోవాలి. ప్రతి స్లైస్ కి కొంచం చీస్ రాసి ఉంచాలి.
2. ఇప్పడు సన్నగా తరిగిన కూరలు, మసాలా పొడి, మెత్తగా పేస్టు చేసుకున్న పచ్చి మిర్చి ,ఉప్పు మొదలయినవన్నీ ఒక బౌల్ లో వేసి కలపుకోవాలి.
౩. ప్రతి బ్రెడ్ స్లైస్ మీద ముందుగా కాబేజీ ఆకుని పెట్టి , ఆ తర్వాత కూర మిశ్రమాన్ని సర్దాలి. మీద న సన్నగా తరిగిన కొత్తి మీర వేయాలి. ఆఖరుగా చీస్ తురిమి వేయాలి .
4. ఓవెన్ వుంటే ఓవెన్ లో బ్రెడ్ ని టోస్ట్ చేయాలి. లేదా పెనం మీద అయితే కొంచం నెయ్యి వేసి అప్పుడు బ్రెడ్ స్లైస్ ని పెట్టి మూత పెట్టాలి. అయితే పెనం మీద చేసేటప్పుడు కూరలని ముందుగా వేయించి పెట్టుకోవాలి .
5. మెల్ట్ అయ్యి ..బ్రెడ్ టోస్ట్ ..కూరల రుచి తో భలే వుంటుంది ..
..రమ