ఆపిల్ కేక్!

 

కావలసిన పదార్ధాలు:

ఆపిల్ - రెండు

పాలు - 1 కప్

మైద - 1 కప్

పంచదార - 1 కప్

వెనీలా ఎసెన్స్ - 1/4 టీ స్పూన్

జీడిపప్పు - 5

ద్రాక్ష - 5

ఉప్పు - చిటికెడు

పెరుగు - 1 టీ స్పూన్

తయారు చేయు విధానము:

ముందుగ ఒక బౌల్ తీసుకొని అందులో పంచదార,మైద,పాలు,బేకింగ్ సోడ, పెరుగు, ఉప్పు,ఆపిల్ జ్యూస్ ఎసెన్స్ వేసి బాగా కలపాలి.

ఒక గిన్నెతీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసి వేడి చేశాక పై మిశ్రమాన్ని అందులో పోయాలి.

ఒవెన్ ను 350 డిగ్రీస్ హీట్ లో వేడయ్యాక అందులో ఆపిల్ మిశ్రమం ఉన్న గిన్నెను అందులో పెట్టి 20నిమిషాలు ఉంచాలి.

తర్వాత బయటకు తీసి నెయ్యిలో జీడిపప్పు, ద్రాక్ష తో అలంకరించాలి.

టేస్టీ ఆపిల్ కేక్ తినడానికి రెడీ.