బ్రెడ్ ఊతప్పం
కావలసిన పదార్ధాలు:
* బ్రెడ్ - 4 ముక్కలు
* ఉల్లి ముక్కలు - 1/4 కప్పు
* మిర్చి - 6 ముక్కలు
* అల్లం ముక్కలు - 1/4 స్పూన్
* కరివేపాకు - 4 ఆకులు
* కారం, ఉప్పు - తగినంత
* బ్రెడ్ ముక్కలు కాల్చడానికి వెన్న, నెయ్యి లేక నూనె
* జీలకర్ర - 1/4 స్పూన్
తయారీ విధానం:
ఒక బౌల్లో ముందుగా బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిపై 1/2 కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. తరువాత గరిటతో మెత్తగా మెదిపితే అది పిండిలా అవుతుంది. అందులో ఉల్లి, మిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ కలిపి ఊతప్పం పిండిలా ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారయిన పిండిని పెనం మీద ముందుగా బటర్ వేసి.. తరువాత ఊతప్పంగా కాస్త దళసరిగా పొయ్యాలి. మూత పెట్టి ఓ 3 నిమిషాలు ఉంచి మూత తీసి అట్లకాడతో తిరగేసి ఇరువైపులా దోరగా కాల్చుకుని దానిని సాస్ తో పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇష్టమైతే అన్నికూరముక్కలు కారెట్, మటర్, పాలకూర, సిమ్లా మిర్చి ముక్కలు కూడా ఈ పిండిలో కులుపుకోవచ్చు. ఇది చాలా త్వరగా అయిపోయే రుచికరమైన స్నాక్.
--Bharathi