LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక కేంద్రంగా సాగిన మాటల యుద్దం చల్లారకముందే వైఎస్ షర్మివ, టీఆర్ఎస్ నేతల మధ్య గరంగరం యుద్ధం సాగుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి కౌంటరిచ్చారు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.  ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై బుధవారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ష‌ర్మిల పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ష‌ర్మిలను ఉద్దేశించేన‌ని ఈజీగా తెలిసిపోతున్నాయి. దీంతో ఆయనకు ఘాటుగా బదులిచ్చారు షర్మిల. 
గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 50 మందికి పైగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.  --- సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ రాశారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై లోకేష్  లేఖ రాశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయని విమర్శించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను, ఆస్తులను దక్కించుకునేందుకే  యత్నిస్తున్నారని తప్పుబట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ----------- అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి నిరాకరించారు. పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని డీజీపీ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు. -------- గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని తనకు నోటీసులిచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆధారాలు సేకరించాలంటూ నానా హంగామా సృష్టించారని చెప్పారు. గంజాయి సాగుతో లోకేష్‌కు సంబంధం ఉందని విజయసాయి అన్నారని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని పవన్ అన్నారని చెప్పారు ------ ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. ----- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. జగన్‌తో లంచ్ చేశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైన సమస్య ఉంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కలిసి మాట్లాడే సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతోంది.  ---- వరి పంట విషయంలో కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఏబీఎన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరి పంటపై కేసీఆర్ డొల్లతనం బయటపడిందన్నారు. ధాన్యం కొనబోమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు ------ కలెక్టర్లు బాగా బలిసి రైతుల మీద మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల పక్షాన కాంగ్రెస్  పోరాడుతుందని ఆయన ప్రకటించారు. నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామన్నారు. ------- తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. --------- బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. బాంబే హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మూడు రోజులుగా ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మొత్తానికి గురువారం ఆర్యన్ ఖాన్‌కు, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ నితిన్ సంబ్రే తీర్పునిచ్చారు. డ్రగ్స్ కేసులో అక్టోబర్ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు ఆర్యన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.  ---
అప్ప‌ట్లో హాట్ హాట్‌గా న‌డిచింది. ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. బ‌హుషా అందుకే కాబోలు మ‌ళ్లీ వేడి రాజేస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య రెండు పార్టీలు అగ్గి ఎగ‌దోసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఏపీ ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఆయ‌న అంతేసి మాట‌లు అన‌గానే.. వీళ్లు ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క త‌ప్ప‌నిసరి ప‌రిస్థితి వ‌స్తోంది. ఇలా కేసీఆర్ వ‌ర్సెస్ వైసీపీ నేత‌లు.. టామ్ అండ్ జెర్రీలా ఆటాడుకుంటున్నారు. ఇదంతా జ‌స్ట్ ఆట‌నో.. లేక రియ‌లో తెలీక ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. మ‌ధ్య‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎంట‌రై రాజ‌కీయాన్ని మ‌రింత రంజుగా మార్చేస్తున్నారు. ఇంత‌కీ తెలుగురాష్ట్రాల మ‌ధ్య ఈ గోలేంటి? ఈ గ‌డిబిడి రాజ‌కీయ‌మేంటి? మాట‌ల మాంత్రికుడు కేసీఆర్‌.. ఇటీవ‌ల పార్టీ ప్లీన‌రీలో ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప‌రువంతా తీసేశారు. ఏపీ క‌రెంట్ కోత‌ల‌తో విల‌విల్లాడుతోంద‌ని.. బొగ్గు కొర‌త వేధిస్తోంద‌ని.. ఆంధ్ర‌ అప్పుల మ‌యంగా మారిందంటూ.. ఇజ్జ‌త్ మొత్తం పోగొట్టారు. స‌రైన నాయ‌క‌త్వం, పాల‌నా ద‌క్ష‌త లేక‌పోతే.. రాష్ట్రం ఏపీలా అథోగ‌తి పాల‌వుతుందంటూ త‌న‌ని తాను పొగుడుకుంటూ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ను ఏకిపారేశారు. తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల‌ను చూసి.. ఏపీలో పార్టీ పెట్టాలంటూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారంటూ త‌న‌దైన స్టైల్‌లో మంట రాజేశారు. అంతే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్ప‌ల‌పై.. ప‌క్క రాష్ట్ర సీఎం మాట్లాడ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ ప‌రువంతా కృష్ణాలో క‌లిసిపోయింది. దీంతో.. ఏపీ మంత్రులు తీరిగ్గా, ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. కేసీఆర్‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు. ముందు స‌జ్జ‌ల స్మూత్‌గా మాట్లాడ‌గా.. తాజాగా మంత్రి పేర్ని నాని కాస్త మ‌సాలా ద‌ట్టించి విమ‌ర్శ‌లు చేశారు. ఇంత‌కీ వారేమ‌న్నారంటే.. ఏపీలో పార్టీ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా రావొచ్చు.. ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల సెల‌విచ్చారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందని సజ్జల అన్నారు. లేటుగా అయినా లేటెస్ట్‌గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా? అంటూ కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని నాని ఎద్దేవా చేశారు.  కొన్ని వారాల క్రితం నీళ్ల జ‌గ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ట్టు సీన్ క్రియేట్ చేసి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను డైవ‌ర్ట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని.. అదే స్ట్రాట‌జీని మ‌రోసారి అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్ సోమ‌వారం ప్లీన‌రీలో ఈ కామెంట్లు చేస్తే.. గురువారం పేర్ని నాని కౌంట‌ర్ ఇవ్వ‌డం కావాల‌నే చేసిన‌ట్టుగా ఉందంటున్నారు. వాళ్లంతా ఒక‌టేన‌ని.. ఇదంతా డ్రామా అని అంతా అంటున్నారు.  ఇక‌, మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఎపిసోడ్ మ‌రింత ఇంట్రెస్టింగ్‌. కేసీఆర్ ఇలా ఏపీలో క‌రెంట్ కోత‌లు, అప్పులు, బొగ్గు గురించి మాట్లాడ‌గానే.. అలా చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. కేసీఆర్ వ్యాఖ్య‌లు క‌రెక్ట్ అని.. సీఎం జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఏపీకి ఇలా క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్పలు దాపురించాయంటూ విమ‌ర్శించారు. అంత‌కుముందు సైతం.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో 36 గంట‌ల దీక్ష ముగింపు సంద‌ర్భంగా చంద్ర‌బాబు కేసీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి.. డ్ర‌గ్స్‌, గంజాయిని అరిక‌ట్టాలంటూ ఆదేశించార‌ని.. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి మాత్రం డ్ర‌గ్స్‌, గంజాయిపై మీటింగ్ పెట్ట‌డానికి స‌మ‌యం కూడా లేదంటూ దుయ్య‌బ‌ట్టారు. ఇలా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు.. కేసీఆర్ కామెంట్ల‌ను బేస్ చేసుకొని.. స‌మ‌యానుకూలంగా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తుండ‌టం వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. అందుకే ఉలికిప‌డిన‌ట్టు ఏపీ మంత్రులు వ‌రుస‌గా కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు ఇస్తూ రాజ‌కీయం ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా స‌జ్జ‌ల మ‌రో అడుగు ముందుకేసి.. కేసీఆర్ ఏదో మాట్లాడతారని.. చంద్రబాబు ఇంకేదో ఆరోపణలు చేస్తారని.. వారిద్దరి మధ్య ఏం అండర్ స్టాండింగ్ ఉందోనని.. ఆరోపిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్‌-వైసీపీ-చంద్ర‌బాబు ఎపిసోడ్‌ను రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌రైన తీర్పు చెప్పనున్నారు.   
త‌మిళిసై. ప్ర‌స్తుత తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌. అంత‌కుముందు త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ టాప్ లీడ‌ర్‌. అప్ప‌ట్లో బీజేపీ మౌత్‌పీస్‌. ఇప్పుడు కేంద్రానికి. కేంద్రం అంటే.. ప‌రోక్షంగా బీజేపీనేగా!. అందుకే, త‌ట‌స్థంగా ఉండాల్సిన‌ గ‌వ‌ర్న‌ర్ కాస్తా.. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఆమె వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ రాజ్‌భ‌వ‌న్‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒక‌ప్పుడు అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య ఆత్మీయ బంధం ఉండేది. రెండు భ‌వ‌న్‌ల మ‌ధ్య దూరం చాలా చాలా త‌క్కువ‌గా ఉండేది. కానీ, త‌మిళిసై వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ దూరం బాగా పెరిగిపోయింది. గ‌వ‌ర్న‌ర్‌ను ముఖ్య‌మంత్రి క‌లిసే సంద‌ర్భాలు చాలా అరుదుగా మారాయి. త‌మిళిసై.. బీజేపీ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న‌లో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఉంది.  ఇక గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. కేవ‌లం ర‌బ్బ‌ర్ స్టాంప్‌లా మాత్ర‌మే ఉండ‌కుండా కొత్త త‌ర‌హాలో స్వ‌తంత్రంగా పనిచేసుకుపోతున్నారు. అదే కేసీఆర్‌కు కంటిగింపుగా మారిందని చెబుతున్నారు. తాజాగా, గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం మ‌రింత దూరం పెంచ‌నుంద‌ని అంటున్నారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు పేద, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ పిల్ల‌ల‌కు దూరం కాకుండా ఉండేలా వారికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ భావించారు. అందుకోసం.. ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వాళ్లు వాడ‌ని ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌ను విరాళంగా ఇవ్వాల‌ని పిలుపు ఇచ్చారు. అవి కావాల్సిన పేద విద్యార్థులు రాజ్‌భ‌వ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటూ ఫోన్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ ఇచ్చి ఆద‌ర్శంగా నిలిచారు. గ‌వ‌ర్న‌ర్ చేస్తున్న‌ది మంచి ప‌నే. అంతా అభినందించాల్సిన విష‌య‌మే. కానీ, ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని.. రాజ్‌భ‌వ‌న్ చేస్తుండ‌ట‌మే.. రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారిందంటున్నారు.  గ‌తంలోనూ ప‌లుమార్లు కేసీఆర్‌ ప్ర‌భుత్వ విధానాల‌ను త‌ప్పుబ‌ట్టారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. అప్ప‌ట్లో స‌ర్కారు పెద్ద సంఖ్య‌లో కొవిడ్ టెస్టులు చేయ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నించారు. యూనివ‌ర్సిటీల‌ వైస్ ఛాన్స‌ల‌ర్ల నియామ‌కం ఆల‌స్యంపైనా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ద‌ర్బార్ పేరుతో రాజ్‌భ‌వ‌న్‌కు సామాన్యుల‌ను ఆహ్వానిస్తూ.. వారి నుంచి స‌మ‌స్య‌ల‌పై విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తున్నారు. ఇలా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. స‌మాంత‌ర పాల‌న న‌డిపిస్తున్నారంటూ ప్ర‌భుత్వం గుర్రుగా ఉంది. ఇక ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్ స‌ర్కారుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేయ‌డం.. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును గ‌వ‌ర్న‌ర్ హోల్డ్‌లో పెట్ట‌డం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం స్ప‌ష్టం చేస్తోంది. అందుకే, గ‌వ‌ర్న‌ర్‌ను నేరుగా క‌లిసే ఉద్దేశ్యం లేక‌నే.. సీఎం కేసీఆర్ ఇటీవ‌ల గాంధీజ‌యంతి రోజున బాపూఘాట్‌కు కూడా వెళ్ల‌లేద‌ని అంటారు. ఇక‌, తాజాగా పేద విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ పిలుపివ్వ‌డం.. రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుగానే అభివ‌ర్ణిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. నగరంలో నిషేదం ఉన్నా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఐదు వేల రూపాయల ఫైన్ విధించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు 30 వేల రూపాయల జరిమానా వేసింది బల్దియీ ఈవీడీఎం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో కటౌట్ ఏర్పాటు చేసినందు MLA దానం నాగేందర్ కు ఫైన్ విధించింది. ఈనెల 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తాన్ని గులాబీ మయం చేశారు అధికార పార్టీ నేతలు, నగరంలో భారీగా కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ , కేటీఆర్ ఫోటోలతో నింపేశారు. టీఆర్ఎస్ జెండాల కట్టేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో నెలువెత్తు స్వాహత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్లినరీ రోజున హైదరాబాద్ మొత్తం గులాబీమయంగా కనిపించింది.  నిజానికి గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడంపై నిషేదం ఉంది. గతంలో చిన్నచిన్న బ్యానర్లు కట్టినందుకే పలువురి నుంచి  ఫైన్ వసూల్ చేసింది బల్దియా. కాని ప్లీనరీ సందర్భంగా నగరం మొత్తం టీఆర్ఎస్ నేతలు పెద్దపెద్ద కటౌట్లు. బ్యానర్లు, ప్లెక్సీలు కట్టినా చూసిచూడినట్టుగా వదిలేసింది. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర విమర్సలు వచ్చాయి. టీఆర్ఎస్ జెండాల అలంకరణపై బల్దియాకు ఫిర్యాదులు కూడా భారీగానే వెలువెత్తాయి. అయినా అధికారులు స్పందించలేదు. బీజేపీ నేతలు బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన కూడా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధికారుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే తమ సర్వర్ పని చేయడం లేదని, తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని అప్పుడు కమిషనర్ ప్రకటింటారు. గడచిన కొన్ని రోజులుగా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైళ్లను నిలిపి వేసిన అధికారులు. ఈరోజు నుండి మళ్లీ ఫైళ్లను వేయడం ప్రారంభించారు. మొదటగా ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జరిమానా విధించారు. 
ALSO ON TELUGUONE N E W S
యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ 'వరుడు కావలెను'. ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య గురువారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. *2018లో 'ఛలో' సక్సెస్‌ పార్టీలో ఎడిటర్‌ చంటిగారి ద్వారా అక్క లక్ష్మీ సౌజన్య పరిచయమయ్యారు. 'ఛలో' సినిమా నచ్చి నన్ను అభినందించి, ఓ కథ చెబుతా వింటావా అన్నారు. సరే అని విన్నాను. అప్పుడు మొదలైన జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతుంది. ఫైనల్‌గా సినిమా విడుదలకు వచ్చింది, మా అక్క కల నిజమయ్యే రోజు వచ్చింది.  *పెళ్లి పీటల ముందు వరకూ... ప్రతి ఇంట్లో చూసే కథే ఇది. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు? సంబంధాలు చూడాలా? అని అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అన్నది ఆలోచించరు. ఇలాంటివి అన్నీ మనం వింటుంటాం. ఈ పాయింట్‌ జనాలకు బాగా రీచ్‌ అవుతుందని అంగీకరించా. ఇది పక్కా యంగ్‌స్టర్స్‌ కథ. మెచ్యుర్డ్‌ లవ్‌స్టోరీ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయి. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది. ఆడవాళ్ల ఓపిక, ప్రేమను ఒప్పించేంత వరకూ వెయిట్‌ చేసే ప్రేమ కథ ఇది. వ్యక్తిగతంగా 70, 80 శాతం నాకీ కథ కనెక్ట్‌ అయింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్‌ రాశారు. ఆ సీన్‌లో నేను యాక్ట్‌ చేశా. డైలాగ్‌లు చెప్పా. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్‌ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. 'అత్తారింటికి దారేది'లో నదియాగారు పోషించిన పాత్ర చూసి ఆమెతో ఈ తరహా పాత్ర చేయించడం కరెక్టేనా అనిపించింది. అయితే షూట్‌లో ఆమె అభినయం చూసి ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత వేరియేషన్‌ ఊహించలేదు.  *ఈ కథ విన్నప్పుడు బావుంది అనిపించింది. షూట్‌కి వెళ్లాక మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా అనిపించింది. ఎడిటింగ్‌ సూట్‌లో అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది అనిపించింది. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక.. బ్లాక్‌బస్టర్‌ అని అర్థమైంది.  *చినబాబుగారు నా కుటుంబ సభ్యులకు సినిమా చూపించమని చెప్పారు. ‘సినిమా మీద డౌట్‌ ఉంటే చూపించొచ్చు. ఇక్కడ ఏ డౌట్‌ లేనప్పుడు జనాలతో కలిసి చూడటమే బావుంటుంది సర్‌’ అని అమ్మవాళ్లకు సినిమా చూపించలేదు అన్నాను. ఆయన లాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం. కథకు ఏం కావాలో వారికి తెలుసు.  *కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్‌ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్‌ చేసినా పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలనుకుంటా. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్‌గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే!  *నేను ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నా. ఈ రంగంలో అడుగుపెట్టాక నాకు మంచి సపోర్ట్‌ దక్కింది. ప్రీ రిలీజ్‌ వేడుకలో బన్నీ అలా మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఆయన మాటలు ఇంకా కష్టపడాలనేంత స్ఫూర్తినిచ్చింది. బన్నీ అన్న కాంప్లిమెంట్స్‌కి థ్యాంక్స్‌. *పెద్దస్టార్‌ కావడానికి 5 వరస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్‌ ‘చలో’. ఇంకా నాలుగు కావాలి. ‘వరుడు కావలెను’ రెండోది పెద్ద హిట్‌. ‘అశ్వద్ధామ’ సక్సెస్‌ కాదు అంటే నేను ఒప్పుకోను. ‘నర్తనశాల’ వంటి ఫ్లాప్‌ సినిమా తర్వాత నాకు బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చిన సినిమా ‘అశ్వద్ధామ’. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా. *గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశా. అమ్మాయి డైరెక్టర్‌ అయితే చాలా అడ్వాంటేజ్‌ ఉంటుంది. వాళ్లకి కోపం త్వరగా రాదు. ఓపిక ఎక్కువ. దేనికీ త్వరగా రియాక్ట్‌ కారు.. ఎప్పుడు రియాక్ట్‌ కావాలో అప్పుడే రియాక్ట్‌ అవుతారు. *అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి’ సినిమా నాకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంటిది. ఈ సినిమా పనులు మొదలుపెట్టి 4 ఏళ్లు అవుతుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమది. అందులో శౌర్యాను ఏడు రకాలుగా చూస్తారు. ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం నేను చేయడం లేదు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా.  * నేను ఎప్పుడు కింద పడిపోలేదు. నేను మెల్లగా నిలబడుతున్నా. ఓటీటీకి నేను రెడీగా లేను. నన్ను నేను 70ఎంఎంలో చూసుకోవాలనుకుంటున్నా. నా సినిమాతో విడుదలవుతున్న ‘రొమాంటిక్‌’ కూడా బాగా ఆడాలి.
విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన సంస్థ‌ల్లో యూవీ క్రియేష‌న్స్ ఒక‌టి. అలాంటి ఈ సంస్థ ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల్లో సుజీత్ ఒక‌రు. 2014లో విడుద‌లైన `ర‌న్ రాజా ర‌న్`(ఇందులో శ‌ర్వానంద్ హీరో)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన సుజీత్.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మెమ‌ర‌బుల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆపై యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో `సాహో` (2019) చేశాడు. పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్కిన ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్.. తెలుగునాట యావ‌రేజ్ గా నిలవ‌గా, హిందీనాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. కాగా, స్వ‌ల్ప విరామం అనంత‌రం సుజీత్ మ‌రో మారు మెగాఫోన్ ప‌ట్ట‌నున్నారు. సుజీత్ తొలి, మ‌లి చిత్రాలు `ర‌న్ రాజా ర‌న్`, `సాహో`ని నిర్మించిన యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌నే ఈ సినిమాని కూడా నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. మ‌రి.. సుజీత్ తో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ మూడో చిత్రం.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.
ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ‌ర‌త్ మండ‌వ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ర‌వితేజ‌కి జంట‌గా `మ‌జిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్, `క‌ర్ణ‌న్` ఫేమ్ రాజీషా విజ‌య‌న్ న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న `రామారావు ఆన్ డ్యూటీ`.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో థియేట‌ర్స్ లోకి రానుంది. ఇదిలా ఉంటే.. `రామారావు ఆన్ డ్యూటీ`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే `రామారావు ఆన్ డ్యూటీ` ఫ‌స్ట్ గ్లింప్స్ కి సంబంధించి క్లారిటీ రానుంది. కాగా, `రామారావు ఆన్ డ్యూటీ` కంటే ముందే `ఖిలాడి`తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు ర‌వితేజ‌. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించనున్నారు. మ‌రోవైపు.. `ధ‌మాకా` పేరుతో త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌లే ఓ సినిమాని ప‌ట్టాలెక్కించారు మాస్ మ‌హారాజా. మ‌రి.. `క్రాక్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత రాబోతున్న ఈ చిత్రాల‌న్నీ ర‌వితేజ‌కి ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి.
  ఆన్‌స్క్రీన్ పైనే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డంలో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి అర్చ‌నా పూర‌న్ సింగ్ నేర్ప‌రి. హీరోయిన్ నుంచి వ్యాంప్ ఆర్టిస్ట్‌గా, ఐట‌మ్ గాళ్‌గా కూడా రాణించిన అర్చ‌న‌, ప్ర‌స్తుతం దేశంలోనే టాప్ కామెడీ టీవీ షో 'ద క‌పిల్‌శ‌ర్మ షో'లో ప‌ర్మ‌నెంట్ గెస్ట్‌గా న‌వ్వులు పంచుతున్నారు. తాజాగా ఆమె చిన్న‌కొడుకు ఆయుష్మాన్ సేథి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో అర్చ‌న అద్దం ముందు నిల్చొని త‌న జుట్టును ట్రిమ్మింగ్ చేసుకుంటోంది. దాన్ని ఆయుష్మాన్ వీడియో తీస్తుండ‌టంతో కోపంతో అత‌డి చెంప ప‌గ‌ల‌గొట్టింది అర్చ‌న‌.  త‌న జుట్టును ఎక్కువ‌గా క‌త్తిరించుకున్నాన‌నీ, ఇంకా క‌ట్ చేస్తే, గుండు అయిపోతుంద‌నీ ఆ వీడియోలో ఆమె చెప్ప‌డం క‌నిపించింది. దీనికి రెస్పాండ్ అయిన ఆయుష్మాన్.. అందుకే క‌దా, డ్రెస్సింగ్ టేబుల్‌పై డ‌స్ట్‌బిన్‌ను పెట్టింద‌ని కామెంట్ చేశాడు. అప్పుడు కొడుకు త‌న‌ను వీడియో తీస్తున్నాడ‌ని గ్ర‌హించిన అర్చ‌న‌, అత‌డి ముఖంపై గ‌ట్టిగా ఒక్క‌టిచ్చింది. వీడియోలో ఆమె కొట్టిన దృశ్యం క‌నిపించ‌లేదు కానీ, చెంప‌దెబ్బ గ‌ట్టిగా కొట్టిన‌ట్లు పెద్ద శ‌బ్ద‌మే వ‌చ్చింది. ఆ వీడియోను షేర్ చేసిన ఆయుష్మాన్ ఆ పోస్ట్‌కు "మా కా థ‌ప్ప‌డ్" (అమ్మ చెంప‌దెబ్బ‌) అనే కాప్ష‌న్ పెట్టాడు. "మీ అమ్మ‌ను ఇరిటేట్ చేయ‌డం కంటే ఫ‌న్ వేరే ఏముంటుంది?" అని కూడా రాసుకొచ్చాడు. కోపంతో ఊగిపోతూ, కొడుకును అర్చ‌న‌ అలా చెంప‌దెబ్బ కొట్ట‌డానికి కార‌ణం.. ఆమె మేక‌ప్ లేకుండా ఉండ‌టమో, ట్రాక్ పాంట్స్‌, ఫ్లోర‌ల్ టాప్ డ్ర‌స్‌తో క్యాజువ‌ల్ లుక్‌లో ఉండ‌ట‌మో కార‌ణం కావ‌చ్చ‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.
సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సకాలంలో పోలీసులు స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి ఓ యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‎నగర్ లో నివాసం ఉంటున్న హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. అయితే గురువారం ఉదయం ఆమె ఉరి వేసుకుంటున్నట్లు లైవ్ వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే స్పందించిన పోలీసులు హిమాయత్ నగర్ లో ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి, ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని.. ఇటీవల హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ ‎స్టేషన్ ‎లో ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హాసిని ఆత్మహత్యాయత్నం చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్న‌ట్లు అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన కొద్ది రోజుల త‌ర్వాత త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అత‌నితో దిగిన ఫొటోల‌ను స‌మంత డిలీట్ చేస్తూ వ‌స్తోంది. నిన్న‌టికి 85 ఫొటోల దాకా ఆమె తొల‌గించిన‌ట్లు సోష‌ల్ మీడియా యూజ‌ర్స్ లెక్క‌లు క‌ట్టారు. ఈరోజు ఆమె మ‌రిన్ని ఫొటోల‌ను తొల‌గించింది. వాటిలో వారి పెళ్లి ఫొటోల‌తో పాటు విహార యాత్ర‌ల్లో ఎంజాయ్ చేసిన‌ప్ప‌టి ఫొటోలు కూడా ఉన్నాయి. జీవితంలో స్వేచ్ఛ‌గా ముందుకు వెళ్లాల‌నుకుంటున్న స‌మంత‌, అందుకు అనుగుణంగా చైత‌న్య‌తో త‌న జ్ఞాప‌కాల‌న్నింటినీ చెరిపేయాల‌నుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టికీ అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫొటోతో పాటు, ఫ్రెండ్స్‌తో తామిద్ద‌రూ క‌లిసి దిగిన కొన్ని ఫొటోల‌ను మాత్రం ఆమె డిలీట్ చేయ‌లేదు. అలాగే త‌న పెంపుడు కుక్క హ్యాష్‌తో చైతూ ఉన్న పొటోను కూడా ఆమె తీసేయ‌లేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్ర‌మంగా ఆమె వ‌ర్క్‌, ఫ్యాష‌న్‌, ఆమె వెకేష‌న‌ల్ టూర్స్‌తో నిండిపోతోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 19.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సోల్ సిస్ట‌ర్ శిల్పారెడ్డితో ఇటీవ‌లే చార్ ధామ్ యాత్ర‌ను పూర్తి చేసుకొని వ‌చ్చిన సామ్‌, ప్ర‌స్తుతం త‌న స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌, మేక‌ప్ ఆర్టిస్ట్ సాధ‌నా సింగ్‌ల‌తో దుబాయ్ టూర్‌లో ఉంది. స‌మంత ఇన్‌స్టా అకౌంట్‌లో ఇంకా క‌నిపిస్తోన్న నాగ‌చైత‌న్య ఫొటోలు...  
తెలుగు చిత్రం `శౌర్యం`తో ద‌ర్శ‌కుడైన శివ‌.. త‌మిళ సినిమాల‌తోనే కెప్టెన్ గా స్టార్ డ‌మ్ చూశారు. మ‌రీముఖ్యంగా.. `సిరుత్తై`, `వీర‌మ్`, `వేదాళ‌మ్`, `విశ్వాస‌మ్` చిత్రాల‌తో అక్క‌డ‌ మాస్ ఆడియ‌న్స్ కు బాగా ద‌గ్గ‌ర‌య్యారాయ‌న‌. త్వ‌ర‌లో ఈ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కాంబినేష‌న్ లో `అణ్ణాత్త‌`తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. తెలుగులో `పెద్ద‌న్న‌` పేరుతో అనువాదం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో శివ తీసిన సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. తెలుగులో `శౌర్యం`, త‌మిళంలో `వేదాళ‌మ్`.. ఈ త‌ర‌హా చిత్రాలే. ఈ రెండు కూడా కోల్ క‌తా నేప‌థ్యంలో సాగే చిత్రాలే కావ‌డం మ‌రో విశేషం. క‌ట్ చేస్తే.. `అణ్ణాత్త‌` కూడా అచ్చంగా అలానే కోల్ క‌తా నేప‌థ్యంలో తెర‌కెక్కిన సిస్ట‌ర్ సెంటిమెంట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి.. శివ సెంటిమెంట్ ఫ‌లించి `శౌర్యం`, `వేదాళ‌మ్` లాగే `అణ్ణాత్త‌` కూడా స‌క్సెస్ ఫుల్ వెంచ‌ర్ గా నిలుస్తుందేమో చూడాలి. కాగా, `అణ్ణాత్త‌`లో ర‌జినీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌గా..  న‌య‌న తార‌, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పుష్ప'. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ, శ్రీవల్లి పాత్రలో రష్మిక అలరించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. 'సామి సామి' అంటూ సాగే పుష్ప మూడో సాంగ్ ఆకట్టుకుంటోంది. ఫోక్ టచ్ తో డీఎస్పీ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ఎనెర్జిటిక్ గా ఉంది. పుష్ప రాజ్ ని ఉద్దేశించి శ్రీవల్లి పాడుకునే ఈ పాటకు చంద్రబోస్ అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఈ సాంగ్ ఆలపించిన మౌనిక యాదవ్.. తన వాయిస్ తో మ్యాజిక్ చేసింది. ఇక లిరికల్ వీడియోలో రష్మిక పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ స్టెప్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'పుష్ప' రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప : ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  వైవిద్యానికి పెద్ద‌పీట వేసే మ‌ల‌యాళ క‌థానాయ‌కుల్లో టొవినో థామ‌స్ ఒక‌రు. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన `ఫోరెన్సిక్`, `మాయాన‌ది`, `వ్యూహం`, `లూకా` వంటి అనువాదాల‌తో తెలుగువారికి కూడా చేరువయ్యాడు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్. త్వ‌ర‌లో టొవినో థామ‌స్.. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో త‌న కొత్త చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆ సినిమానే.. `మిన్నల్ ముర‌ళి`. సూప‌ర్ హీరో అడ్వెంచ‌ర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో గ్లోబ‌ల్ ప‌వ‌ర్స్ ఉన్న లోక‌ల్ సూప‌ర్ హీరోగా ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాడు టొవినో. 2020 చివ‌ర‌లోనే థియేట్రిక‌ల్ రిలీజ్ గా సంద‌డి చేయాల్సిన ఈ మూవీ.. క‌రోనా ఎఫెక్ట్ తో ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఫైన‌ల్ గా.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24 నుంచి స్ట్రీమ్ కానున్న `మిన్న‌ల్ ముర‌ళి`.. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఒకే టైటిల్ తో అనువాద రూపంలో అందుబాటులో ఉండ‌నుంది. బ‌సిల్ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సోఫియా పాల్ నిర్మించారు. మ‌రి.. టొవినో గ‌త చిత్రం `కాణేక్కాణే` సోనీ లివ్ లో నేరుగా స్ట్రీమ్ అయి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న నేప‌థ్యంలో..  158 నిమిషాల `మిన్న‌ల్ ముర‌ళి` కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి.  
  తెలుగునాట బాల‌న‌టుడిగానూ, క‌థానాయ‌కుడిగానూ త‌నదైన ముద్రవేశారు త‌రుణ్. `ఇది నా ల‌వ్ స్టోరి` (2018) త‌రువాత మ‌ళ్ళీ తెర‌పై క‌నిపించ‌ని ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్.. ఇటీవ‌ల ఆహాలో స్ట్రీమ్ అయిన మ‌ల‌యాళ అనువాద చిత్రం `అనుకోని అతిథి` కోసం ఫ‌హ‌ద్ ఫాజిల్ కి డ‌బ్బింగ్ చెప్పి వార్త‌ల్లో నిలిచారు. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో త‌రుణ్ మ‌రోసారి మేక‌ప్ వేసుకోనున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `అత‌డు`, `ఖ‌లేజా` త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే ఓ ముఖ్య పాత్ర ఉంద‌ట‌. ఈ వేషం కోసం త‌రుణ్ ని సంప్ర‌దించార‌ట త్రివిక్ర‌మ్. పాత్ర న‌చ్చ‌డంతో త‌రుణ్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు బ‌జ్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, త‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ తొలి చిత్రం `నువ్వే కావాలి`తో త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా స్టార్ డ‌మ్ చూశారు. అలాగే, త‌రుణ్ న‌టించిన `నువ్వే నువ్వే`తోనే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశారు. ఆ అనుబంధంతోనే త‌రుణ్, త్రివిక్ర‌మ్ మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్.  
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్ బౌల్ మరియు మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.   1 . బాత్రూం లో ఫోన్ వాడడం కొందరికి బాత్రూం లో ఫోన్ వాడడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా?  టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ మరియు కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటివల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున, టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   2 . హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం హ్యాండ్ బ్యాగ్ లు మరియు పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్ కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్ కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్ ని పై నుండి మరియు లోపల యాంటీ బాక్టీరియా క్లాత్‌తో తుడిచివేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.   3 . షూస్ ఎక్కువ సేపు ధరించడం ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 % షూస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్ కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే, ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.   4 . రిమోట్ ని శుభ్రపరచకపోవడం మనం టీవీ రిమోట్ ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే, రిమోట్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.   5 . స్పాంజిని సరిగ్గా పిండకపోవడం స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి, స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం.
ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి  విషయానికి పోటీ పడాలి. ముఖ్యంగా నగరజీవనంలో  నడక అస్సలు పనికిరాదు. పరిగెడుతూనే ఉండాలి. అవకాశాల కోసమూ, అవసరాల కోసమూ. కొందరికి అదొక ఛాలెంజ్ అయితే మరికొందరికి జీవన్మరణ సమస్య కూడా అవుతుంటుంది. కాకపోతే ఈ బిజీ జీవితాల్లో, గందరగోళంలో ఎవరూ ఎక్కువగా గమనించరు అంతే. అందుకే జీవితాన్ని బతకడమనే పరుగుపందెంలో దించి పరిగేడుతూనే ఉంటారు అందరూ.  చిన్ననాడు ఆడుతూ పాడుతూ మొదలు పెట్టిన పరుగు క్రమంగా విద్య, ఉద్యోగం, సంసారం, ఆశలు, ఆశయాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, కుటుంబంలో అందరిని కాంప్రమైజ్ చేయాలనే ఆలోచన ఇట్లా అన్నిటి కోసం పరుగు పెడుతూనే ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ పరుగులో ఏదొక అడ్డంకి వల్ల తూలి పడటమో, లేక శక్తి చాలక పడిపోవడమో లేక ఇంకా వేరే కారణాలు కూడా ఉండచ్చు.   కానీ పడిపోగానే ఇక ముగిసిపోయినట్టు కాదు కదా. సాదారణంగా చాలామంది జీవితంలో సఫర్ అయ్యేది విద్య ఉద్యోగమనే అంశాల్లోనే. సరైన విధంగా టార్గెట్ చేరుకోకపోవడం చధవలేకపోవడం, చదివినా సరైన ఏకాగ్రత లేక చదివిన దాన్ని గుర్తుపెట్టుకోలేక పరీక్షల్లో పేలవమైన మార్కులు, ఫెయిల్ అవ్వడాలు ఇట్లాంటివి ఎదురవుతూనే ఉంటయి విద్యార్థుల జీవితంలో. ఇక విద్య ముగిశాక, ఉద్యోగం సంపాదించాక హమ్మయ్య అనుకోలేరు ఎవరూ. ఎందుకంటే ఉద్యోగం కూడా హాయిగా ఏమి సాగదు. టార్గెట్లు, ప్రాజెక్టులు, పై ఆఫీసర్లను మెప్పించడంలోనూ, వర్క్ పరంగా సాటిసిఫాక్షన్ అయ్యేలా చేయడంలో విఫలం అవుతూ ఆత్మన్యూనతకు గురయ్యే ఉద్యోగస్తులు కూడా ఎందరో.  అయితే ఓటమి నుండి పాఠం నేర్చుకుంటూ గెలుపు కోసం మరింత కష్టపడుతూ, తమని తాము మెరుగుపరుచుకునే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. వాళ్ళందరిలో లోపించింది ఏమిటి అంటే ..... క్రీడాతత్వం. దాన్నే స్పోర్టివ్ నెస్ అని అచ్చంగా ఆంగ్లంలో అనేస్తున్నారు. క్రీడలనేవి చిన్నప్పటి నుండి మనకు తెలిసినవే. అయితే రాను రాను చదువుల పేరుతో వాటికి దూరం గా పిల్లలను కేవలం పుస్తకాలతోనే ఉంచడం వల్ల వాళ్లలో పెద్దయ్యే కొద్దీ గెలుపు ఓటమి అనేవాటిని ఎలా సమానంగా తీసుకోవాలి అనే విషయం అవగాహనలో లేక ఒత్తిడిలో పడిపోతున్నారు. అందుకనే మానసికంగా కూడా దృఢంగా లేక చిన్న విషయలకే ఎంతో డిస్టర్బ్ అయిపోతుంటారు ఇప్పటి తరం.   క్రీడాతత్వం వల్ల ఏమి ప్రయోజనం??  ప్రతి పనిలో విఫలం, సఫలం సహజం. పోటీ ప్రపంచంలో గెలుపు, ఓటమి మరింత సహజం. వందమంది పోటీ పడే ఉద్యోగానికి ఒక్కరే ఎంపిక అవుతారు. అందులో మిగిలిన 99 మంది పనికిరాని వాళ్ళని కాదు లెక్క. వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, లేక అమలుపరిచే చోట ఏదో తప్పిదం చేసారని కూడా అనుకోవచ్చు. అదీ కాదు అంటే ఆ గెలిచిన వాళ్ళు, ఎంపికైన వాళ్ళు, ఇతరుల కంటే ఇంకా మంచి ప్రణాళికతో సన్నద్ధం అయ్యి ఉండవచ్చు.  ఇట్లా విషయన్ని  అన్ని విధాలా విశ్లేషించుకుని, విమర్శించుకుని తమలో ఉన్న లోటుపాట్లను తెలుసుకునేల చేసేది క్రీడాతత్వమే.  అంతే కానీ ఒడిపోవడాన్ని సమర్థించుకోవడం కాదు. ఓటమికి గల  కారణాలను తెలుసుకోవడం. పరిశీలన, ఏకాగ్రత, విభిన్న ప్రణాళికలు, వవాటిని అమలుపరిచే విధానం, ప్రతి విషయాన్ని చూసే కోణం, స్పందించే తీరు వీటన్నిటి వల్ల మనుషులతో మెలిగే విధానం. వ్యక్తిత్వ పరంగా పరిపక్వత వంటివెన్నో ఈ క్రీడాతత్వం వల్లనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీలో కూడా ఈ స్పోర్టివ్ నెస్ ఉందా?? లేదా లెస్ గా ఉందా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.                                                                                       ◆ వెంకటేష్ పువ్వాడ
 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా?? యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు.  కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి?? మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.                                                                                                                                                                                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ
వాయు కాలుష్యం, రోడ్డు పై వచ్చే శబ్ద కాలుష్యంకొన్ని ఏళ్లుగా వింటున్న వారికి హార్ట్ ఫైల్యూర్ వస్తుందని  పరిశోదన వెల్లడించింది. డెన్మార్క్ లో 22,౦౦౦ మహిళా నర్సులపై పరిశోదన జరిపింది.44 సంవత్సరాలు  పై బడ్డ వారు 15 నుంచి 2౦ సంవత్సరాల పాటు మదించిన నైట్రో జన్,డయాక్సైడ్ రేణువులు,రోడ్డు పై  ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం ప్రభావం వల్ల మూడు సంవత్సరాల  తరువాత కొత్తగా హార్ట్ ఫైల్యూర్  కు దారి తీసింది. గతం లో పోగాతాగడం అలవాటు ఉన్నవారు.హై బి పి ఉన్న వారు దీనివల్ల విరుద్ధమైన ప్రభావం  లేదా వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది. కోపాన్ హార్గాన్ విశ్వవిద్యాలయం డెన్మార్క్ కు చెందిన పర్యావరణ  శాస్త్ర వేత్తడిపార్ట్ మెంట్ అఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోఫెసుర్ యు న్ -హీలిన్  వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. గతం లో పొగతాగడం అలవాటు ఉన్న వారు.72%హార్ట్ ఫైల్యూర్ కు ప్రబావం ఉంటుందని. 3 కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్ శబ్దానికి కాలుష్యం 3% రెడియస్ లోని పరిదిలో ఇళ్ళు వాతావరణ కాలు ష్యం కన్నా శబ్ద కాలుష్యం ప్రామాదకరం హార్ట్ ఫైల్యూర్ కు కారణం అని విశ్లేషించారు.  అమెరికన్ జనరల్ హార్ట్ అసోసియేషన్ డిసీజెస్ లో ఈ  అంశాన్ని ప్రచురించారు.పరిశోదనలో కనుగొన్న కొన్ని అంశాలను  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ లో ప్రచురించారు.గతంలో జరిగిన పరిశోదనలో వాయు కాలుష్యం,రోడ్ ట్రాఫిక్ వల్ల   వచ్చే శబ్ద కాలుష్యం వ్యక్తి గతంగా ఆరోగ్యం పై తీవ్రప్రాభావం చూపుతాయి.కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సిందే. వాతా వరణ కాలుష్యం తోనే హార్ట్ ఫైల్యూర్ రిస్క్ ఉంది. నగరాలలో ఊపిరి తిత్తుల అనారోగ్యం,ఎక్కడైతే ఎక్కువ కాల్యుష్యం ఉంటుందో దానిని హార్ట్ ఫైల్యూర్ గా పరిగణించడం. గాలిలో ఉండే కాలుష్యం వల్ల ట్రోమాకి కరాణం గా పేర్కొన్నారు. ఈ పరిశోదనలో మహిళా నర్సుల పేర్లను నమోదు చేసుకున్నారు. వారి పూర్తి వివరాలను ఒక ప్రశ్నావళి లో సేకరించారు. వారి బాడీ మోస్ ఇండెక్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ  అలవాట్లు,సిగరెట్,మద్యం,వినియోగం,శరీర వ్యాయామవ్యాయామం,ఆహారపు  అలవాట్లు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పునర్నిర్మాణం, పని చేసే తీరు తెన్ను,ఇంటి లోపలి కాలుష్యం పెద్దగా  ప్రభావం  చూపలేదు. కాలుష్య నియంత్రణ చేయగలిగితేనే హార్ట్ ఫైల్యూర్ తగ్గించవచ్చు అని నిపుణులు నిర్ధారించారు.                                                  
లివర్ వ్యాధి మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది.అని ఒక పరిశోదనలో గుర్తించారు.లివర్ వ్యాధి సహజంగా  హెపటైటిస్ లేదా ఆల్కాహాల్ కు సంబంధం ఉంది.ఊబకాయం.డయాబెటిస్ వల్ల మీ లివర్ పాడై పోతుంది. వాస్తవానికి ఫ్యాటి లివర్ వ్యాధి పెరిగితే వ్యక్తులు చనిపోతారు.అని ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఫ్యాటి లివర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ మెల్లగా మిమ్మల్ని సైలెంట్ గా చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటి లివర్ వల్ల నష్టం కావడమే కాదు మీరు దీర్ఘకాలం పాటు సమస్యలు తప్పవని ఈ అంశం పై అమెరికాకు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెన్ని క్లార్క్ హక్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ బాల్టి మోర్ ఎం డి   బృందం జరిపిన  పరిశోదనలు లివర్ వ్యాధి వృద్ధి చెందుతూఉంటుంది.లివర్ వ్యాధి ఒక్క సారి వస్తే కొన్ని  ఏళ్ల పాటు  వృద్ధి చెందు తూనే ఉంటుంది.  లివర్ పై వచ్చే చారలు,మచ్చల వల్ల చాలామంది చనిపోతున్నారని డాక్టర్ క్లార్క్  అన్నారు. శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోయి లివర్ లో నిల్వ ఉంటుందో దీనికారణం గానే ఇంఫ్లామేషణ్ తో పాటు స్కార్స్ వస్తాయని క్లార్క్ అన్నారు. కొవ్వు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకోవడమే గీస కూడా కావచ్చని క్లార్క్ పేర్కొన్నారు.అధికంగా కార్బో హైడ్రేడ్స్ తీసుకోవడం వాళ్ళ మేతాబాలిక్ సిస్టం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.అది ఫ్యాట్ ను పెంచుతాయాని అన్నారు. ప్రపంచం లో ప్రతి నలుగురిలో ఒకరు  ఫ్యాటి లివర్ సమాస్యతో బాధ పడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  లో ఒక నూతన పరిశోదన ద్వారా అధునాతన ఫ్యాటిలివర్ వ్యాధి వల్ల హెపటైటిస్ సి ప్రాధాన కారణ మనిపేర్కొన్నారు.  కివేర్ పై స్కార్ మచ్చ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేన.... మానవులలో ఫ్యాటి లివర్ డిసీజ్ కు మేతాబాలిక్ సిండ్రోం అని డాక్టర్ స్క్రత్ ఫ్రైడ్ మెన్ డేఒన్ హేపటిస్ట్ అన్నారు. లివర్ పై ఒక్కసారి సచార్ వాస్తే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిందే. మెటా బాలిక్ సిండ్రోం కు అనారోగ్య సమాస్యలకు  మూలమని తేల్చారు.దీనివల్ల హార్ట్ డిసీజ్,స్ట్రొక్,టైప్ 2 డయాబెటిస్ దీనివల్ల బిపి,హై బ్లడ్ షుగర్,వీటి వల్ల కొవ్వు  అదనంగా చేరి,కొలస్ట్రాల్ లో హెచ్చుతగ్గులు,పొట్ట పెరగడం.వంటివి ఉంటాయి. లివర్ పెరుగుతున్నాయి అంటే ఊబ కాయం టైపు 2 డయాబెటిస్ మేతాబాలిక్ సిండ్రోం లివర్ డిసీజ్ కు కారణంగా  చెప్పవచ్చు. ఈ అంశం పై పరిశోదనలు జరిపిన డాక్టర్ల బృందం 18౦౦ ఫ్యాటి లివర్ తో సంబంధం ఉన్న వారిని పరిశీలించారు.  నాలుగు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. లివేర్ లో  స్కార్రింగ్  అభివృద్ధి చెందడానికి కారణం లివర్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నట్లు అధ్యయనం లో తెలుసుకున్నారు.  అంతర్గతంగా రక్త  శ్రావం  అదనపు రాసాయనాలు మానసికంగా గందరగోళం గాఉంటుంది .శరీరంలో రక రకాల రాసయనాలు మెదడు  పై ప్రభావం చూపుతాయి.ఫ్యాటి లివర్ ఉంటె టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.కిడ్నీ పనితీరులో మార్పు వస్తుంది. అని పరిశోదనలో తెలిపారు.లివర్ సమస్యల వాళ్ళ ఫ్యాటిలివర్ వల్ల 7% మరణాలాను ఈ బృందం గుర్తించింది. ఊబకాయం,డయాబెటిస్,ఉన్నవారిలో ఫ్యాటిలివేర్ 2౦%  నుండి 3౦ % స్కారింగ్ వృద్ధి చెందుతోంది.కొందరికి ఫ్యాట్ మాత్రమే  ఉంటె కొందరిలో ఇంజురీస్ ఉంటాయి.ఫ్యాటి లివర్ కు వెయిట్ లాస్ చికిత్స తో నియంత్రిన్చాగాలిగారు.  అయితే ఫ్యాటి లివర్ నియంత్రణకు లోని ఫిబ్రోనోర్ మందును ఎక్కువ మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. బెల్జియంకు చెందినా బ్రొకుఒ పియర్  ఈ అంశాన్ని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ఫ్యాటి లివర్ లక్షణాలు వస్తే తక్షణం నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఊబాకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పాడడం కార్బో హైడ్రేడ్స్ తగ్గించడం వాళ్ళ కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు  తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవదని మరణానికి గురికవద్దని వైద్యులు సూచించారు.                                               
వర్షాకాలం తరువాత రానున్నది ఫ్లూ కాలమే అని అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫ్లూ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటినిబంధనలు పాటించడం వల్ల ఫ్లూ కేసులు 6౦ %తగ్గు ముఖం పట్టాయి. కోవిడ్ తరువాత పదివారాలు లాక్ డౌన్ ఉన్నందున కొలంబియ విశ్వ విద్యాలయం  పరిశోధకులు శాస్త్రజ్ఞులు అధయనం చేసారు. ముఖం పై మాస్క్,చేయి సానిటైజ్ చేసుకోడం వల్ల ఇంఫ్లూ ఎంజా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ సమయం లో నిరోధించ గాలి గా మన్నారు. ఇన్వి రాన్ మెంట్ హెల్త్  సైన్సెస్  అసిస్టెంట్ ప్రోఫెసర్ సెన్ పైన్ వెల్లడించారు. మేల్మేన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూయార్క్ కు చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో కోవిడ్ 19  ఇంఫ్లూ ఎంజా ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది.సార్క్ కోవిడ్ ను నియంత్రించడం ద్వారా ఇంఫ్లూ ఎంజా  విస్తరణను తగ్గించ వచ్చు. దురదృష్ట వసాత్తూ చాలా ప్రదేశాలాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్19 నియమ నిబందన ను  తొలగించారు.కాగా రానున్న చలికాలం ముందు ముందు ఫ్లూ విజ్రుంభించే కాలం అని పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఫ్లూ చాలా సులభంగా త్వరగా విస్తరిస్తుంది.అయితే రక్షణ కవచం లేకుంటే  ప్రజలలో రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇంఫ్లూ ఎంజా గత సంవత్సరం యు ఎస్ లో ఫ్లూఎంజా లేదు. ఇంఫ్లూ ఎంజా  వైరస్ ఎప్పటికప్పుడు పరివర్తన,రూపాంతరం  చెందుతూ ఉంటుందని పై అన్నారు. ప్రతి రెండు,లేదా 5 సంవత్సరాల కోక సారి ఇంఫ్లూ ఎంజాతో ఇన్ఫెక్షన్ కు గురియ్యారని. ఇంఫ్లూ ఎంజా మళ్ళీ వచ్చే అవకాసం ఉందని మన రోగ నిరోధక శక్తి తగ్గిందో సమస్యలు తప్పవని ఒక పరిశోదనలో పై బృందం కంప్యుటర్ మోడల్ ద్వారా ప్రయాణం ఆంక్షలు,పేస్ మాస్క్,సామాజిక దూరం  పాట శాలాల మూసివేత వల్ల 2౦2౦ లో వ్యాప్తి ప్రభావం లేదని తేల్చారు. ఫ్లూ విస్తృత వ్యాప్తి చెందితే... ఒక నాతన పరిశోదనలో విస్తృత స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాప్తి చెందితే రానున్న కాలం ఫ్లూ ను  ఎదుర్కోక తప్పదు అని ఈ సంవత్సరాన్ని ఫ్లూ సంవత్సరంగా పేర్కొన్నారు.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్  ఎండి మెడికల్ డైరెక్టర్ బెతేన్స్ డే డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని. అంచనా వేస్తున్నారు. యు ఎస్ లో ఇప్పటికే 2,౦౦౦ కేసులు నమోదు అయ్యాయని యుఎస్ కు చెందినా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  ప్రిమిక్షన్ 2౦2౦ -2౦ 21 ఫ్లూ సీజన్ గా పేర్కొన్నారు.ఫ్లూ సీజన్ 35 మిలియన్ల కేసులు ఉన్నాయని సమాచారం. 2౦2౦ -2౦21 లో ఒక బాలుడు మాత్రమే ఫ్లూ తో మరణించాడని.మూడు సీజన్లలో 144 -199 కన్నా  తక్కువే అని సి డి సి పేర్కొంది. సామాజిక దూరం,మాస్క్ వంటివి పిల్లలు వేసుకోవడం,పాతాశాలలు మూసి వేయడం వల్ల ఇంఫ్లూ ఎంజా లేదని. తేల్చారు. కొంత మంది నిపుణులు చర్చల సమయం లో ప్రజలలో ఇమ్యునిటి సరిగా లేక పోయినా ఇబ్బిడి ముబ్బిడి గా  జనభాపెరుగుదల వల్ల ఫ్లూ త్వరగా విస్తరిస్తుందని.ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఎక్కువే అని లేదా ఫ్లూ వల్ల తీవ్ర అనారోగ్యం.అస్వస్థత,కు గురి  కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా ఆయారాష్ట్ర్రాలు ప్రజా ఆరోగ్యానికి చెందిన అధికారులు  మాస్క్ వేసుకోవాలాని లేదంటే ఫ్లూ కు గురికాక తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  సిడిసి 2౦2౦ -2౦21 ని ఫ్లూ నివారణ సంవత్సరంగా ప్రకటించింది.