స్వేరో ప్రవీణ్ కు షర్మిల సపోర్ట్? 

Publish Date:Mar 25, 2021

Advertisement

ఎవరితోనూ పొత్తు లుండవు. ఒంటరిగానే పోటీ చేస్తాం,  దేవుని దయతో విజయం సాధిస్తాం ... ఇది ఏ తెరాస నేతలో, బీజేపీ లేదా కాంగ్రెస్ నాయకులో, చేసిన ప్రకటన కాదు. ఇంకా పుట్టని, పేరైనా పెట్టని పార్టీ, నాయకురాలు  వైఎస్ షర్మిల వ్యక్తం చేసిన  విశ్వాసం. ఇది విశ్వాసమో మరొకటో, కానీ, ఆమె మాటతీరు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, దేవుని బిడ్డగానే, దేవుని పేరునే ఆమె రాజకీయ ప్రస్థానం సాగుతోందని, ఆమె రాజకీయ అడుగులను గమనిస్తున్న సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రాజన్న రాజ్యం పేరున ఏసు రాజ్య స్థాపనకోసమే ఆమె ఆరాటమని అర్థమవుతుంది. 

వచ్చెనెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ ఏర్పాట్లను సమీక్షరించేందుకు  పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో ఆమె గురువారం లోటస్ పాండ్’లో సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె, ఒంటరి ప్రకటన చేశారు. అంతే కాదు  తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు.అలాగే, ఎవరో పిలిస్తే, ఎవరికో పరోక్షంగా ప్రయోజనం చేకూర్చెందుకో, రాలేదని,స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని,  బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు.

అదెలా ఉన్నా ఆమె వివాదాస్పద  ఐపీఎస్ అధికారి,  స్వేరో ప్రవీణ్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వేరో ప్రవీణ్ కుమార్ ఎవరో ఏమిటో, ఎలాంటి కరుడుగట్టిన హిందూ వ్యతిరేకో వేరే చెప్పనక్కర లేదు. ఆయన తమ అధికారాన్ని, ప్రభుత్వ సంపూర్ణ సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ, తెలంగాణలో క్రైస్తవ రాజ్య స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడుగా,  ఏసు బిడ్డగా క్రైస్తవ సమాజం ప్రసంసలు అందుకుంటున్నారు. అలాంటి ఏసు భక్తుని, షర్మిల సమర్ధించడం, ఆయన షర్మిలను సమర్ధించడం, ఆ ఇద్దరినీ  మరొక దొరగారు సమర్ధించడంలో ఆశ్చర్య పోవలసిన విషయం కానీ, అనుమానించవలసిన విశేషం గానీ ఏదీ లేదు. ఎక్కడున్నా క్రైస్తవులంతా ఒక్కటే,అందరి లక్షం ఒక్కటే, ఏసు రాజ్య స్థాపనే అందరి లక్ష్యం, పేరు మాత్రమే రాజన్న రాజ్యం ... స్వేరో ప్రవీణ్’కు మద్దతు తెలపడంతో షర్మిల తమ నిజ రూపాన్ని బయట పెట్టారు. 

అయితే, షర్మిల సంకల్పానికి, సంకల్ప సభకు సభకు కోవిడ్ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రజల ముందు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఆమె చేస్తున్న ఏర్పాట్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.

షర్మిల మాత్రం దేవుని మీద భారంవేసి అకేలా యతకు సిద్దమవుతున్నారు. మరో వంక ఆమె రాజకీయ సంకల్పం, ప్రస్థానం విషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగి పోలేదు. ఆమె ఎంత గట్టిగా తెరాస రమ్మంటేనో ,వచ్చిన వాళ్ళం కాదు , బీజేపీ పిలిస్తేనో వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పుకుంటే అంతగా అనుమానాలు బలపదుతున్నాయి.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.